
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం అనే రాజ్యాంగ విలువలను గణతంత్ర దినోత్సవం గుర్తు చేస్తుందని ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ నాయకుడు పోలాడి రామారావు అన్నారు.
1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ అవతరించిన విషయాన్ని గుర్తు చేశారు.ఈ చారిత్రాత్మక దినాన్ని స్మరించుకుంటూ, ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు.
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల పరిధిలోని వన్నారం గ్రామంలో గ్రామ పంచాయతి పాలకవర్గంతో పాటు ప్రాథమిక పాఠశాల, యాదవ సంఘం, అంబేద్కర్ సంఘం, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో
పోలాడి రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ అన్ని వర్గాల పౌరులు అంబేద్కర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం లో పొందుపర్చిన ప్రాథమిక హక్కులను విధిగా పౌరులందరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రజలు,పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీగా గ్రామ ప్రధాన కూడలి వద్దకు చేరుకోగా ముందుగా జాతీయ పతాకాన్ని పోలాడి రామారావు ఎగురవేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాల వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గ్రామ పంచాయతి సర్పంచ్ తాళ్ళ పల్లి సంపత్ ఉప సర్పంచ్ బాకారపు రాములు, మాజీ సర్పంచ్ బాకారపు శ్రీనివాస్, ఉప సర్పంచ్ బుద్ధుల తిరుపతి, మాజీ ఎంపీటీసీ గంగుల రవి సీనియర్ నాయకులు పోలాడి యాదగిరి రావు, బనుక వేణు,బాకారపు తిరుపతి, బనుక తిరుపతి, మద్దెల తిరుపతి, బాకారావు రమేష్, జంగిలి రాకేష్, తాళ్ళపల్లి కొమరయ్యతో కలిసి వివిధ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతి సెక్రటరీ ప్రసూన, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చీటి భారతి, అంగన్వాడీ టీచర్ తాళ్ళపల్లి మౌనిక, ఉద్యోగులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో ఉత్సాహంగా జాతీయ జెండాలు చేత పట్టుకొని పాల్గొన్నారు.




జాతీయ జెండకు సెల్యూట్ చేస్తున్న పోలాడి రామారావు గ్రామస్తులు..





