
–కాట్రపల్లిలో ఉచిత పశువైద్య శిబిరం:
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జనవరి 27: పాడి రైతులు పశువుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలనీ హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామ సర్పంచ్ పెరుమాండ్ల హైమా – బిక్షపతి సూచించారు. మంగళవారం హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య, ఆరోగ్య మరియు పునరుత్పత్తి శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ పశుగణాభివృద్ధి వ్యవస్థలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ పెరుమాండ్ల హైమా – బిక్షపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ హైమా – బిక్షపతి మాట్లాడుతూ గ్రామంలోని పాడి రైతులు తమ పశువుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఉచిత శిబిరాలను సద్వినియోగం చేసుకొని పాల ఉత్పత్తిని పెంచాలని కోరారు. పాడి పశువుల పెంపకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆమె పేర్కొన్నారు.
125 పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు
శిబిరంలో సింగపూర్ పశువైద్యాధికారి డాక్టర్ పి. రవీందర్ రెడ్డి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పశువులలో వచ్చే గర్భకోశ సమస్యల వల్ల పునరుత్పత్తి తగ్గి రైతులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఆధునిక చికిత్సా పద్ధతుల ద్వారా పశువులలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, పాడిని లాభసాటిగా మార్చుకోవచ్చని సూచించారు. ఈ శిబిరంలో సుమారు 125 పాడి పశువులకు గర్భకోశ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. కాగా గోపాల మిత్ర సూపర్వైజర్ రామ్ రెడ్డి, గోపాల మిత్రులు పెరుమాండ్ల రవీందర్, రమేష్, గ్రామంలోని రైతులు తమ పశువులతో హాజరై శిబిరాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో చెల్పూర్ పశువైద్యాధికారి డాక్టర్ రాజేష్, జమ్మికుంట పశువైద్యాధికారి రాజ్ కుమార్, గ్రామ ఉపసర్పంచ్ గంగాదారి బిక్షపతి పాల్గొన్నారు.

పశువైద్య శిబిరం వివరాలను వైద్యాధికారి రవీందర్ రెడ్డిని అడిగి తెలుసుకుంటున్న గ్రామ సర్పంచ్ హైమా- బిక్షపతి

పశువైద్య శిబిరంలో రైతులకు ఉచిత మందులను అందజేస్తున్న సర్పంచ్ హైమ..

ఉచిత పశువైద్య శిబిరంలో పశువులను పరీక్షిస్తున్న వైద్యాధికారి రవీందర్ రెడ్డి…





