
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మూడు సార్లు వార్డులో వరసగా విజయ దుందుభి మోగిస్తు వస్తున్న 26వ వార్డు సభ్యురాలు కేసిరెడ్డి లావణ్య మరోసారి గెలిచి మున్సిపల్ రికార్డు సృష్టించే అవకాశం ఉండడంతో మరోసారి అవకాశం రావడంతో 26వ వార్డు నుండి బిఆర్ఎస్ కేసిరెడ్డి లావణ్య ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. పెద్ద ఎత్తున అభిమానులు, ఓటర్లుతో కలిసి నామినేషన్ వేశారు. వార్డుకు చెందిన హుజురాబాద్ కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు శీల రాజేంద్రప్రసాద్, ఆడెపు శ్రీనివాస్ లు మద్దతుగా బల పరిచారు. వీరితో పాటు సీనియర్ నేత ఇనుగాల గోవర్ధన్, యళ్ళ రేణుక రమేష్, మణి, సలీం, శ్రీనివాస్ రెడ్డి, పత్తి రాంరెడ్డి, లక్కి అశోక్, ఇల్లందుల సంజీవ్, రాపాక రాజమౌళి, ఇల్లందుల తిరుపతి, ధోని తదితరులు పాల్గొన్నారు.




ర్యాలీగా తరలివచ్చి చౌరస్తాలో అంబేద్కర్ కు పూల మాల వేసి నమస్కరిస్తున్న 26వ వార్డు సభ్యురాలు కేసిరెడ్డి లావణ్య


నామినేషన్ వేసి సంతకం చేస్తున్న కేసిరెడ్డి లావణ్య





