
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వివాహిత తన భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదని కిరోసిన్ పోసుకొని హుజురాబాద్- జమ్మికుంట ప్రధాన రహదారిపై బైఠాయించి హల్ చల్ సృష్టించారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా జాఫర్గడ్ మండలం తీగారం గ్రామానికి చెందిన గండ్రకోట జంపయ్య, మహాలక్ష్మి దంపతుల కుమార్తె శ్రావణి నీ హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కుంచెము అరవిందు రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకొని కాపురానికి తీసుకువెళ్లడం లేదని వారు ఆరోపించారు. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నడిరోడ్డుపై పడుకొని ఆందోళన నిర్వహించారు. సంఘటన స్థలం చేరుకొని పోలీసులు ఎంత నచ్చజెప్పినా ఆందోళన చేయడంతో అక్కడి నుండి బలవంతంగా స్టేషన్ కు తరలించిన పోలీసులు తన కుటుంబ సభ్యులపైనే కేసు పెడతా మంటున్నారని, పోలీసులు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తనకు తగిన న్యాయం చేసేంతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని వివాహిత, ఆమె తల్లిదండ్రులు భీష్మించు కూర్చున్నారు. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడంతో రోడ్డుపై వెళ్లేవారు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఆఖరికి పోలీస్ స్టేషన్ లోపలికి తరలించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.





అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాన రహదారిపై బైఠాయించి రోధిస్తున్న బాధితురాలు శ్రావణి..




పోలీస్ స్టేషన్ ఎదుట హుజురాబాద్ జమ్మికుంట ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్న బాధితులు.. బలవంతంగా స్టేషన్ తరలిస్తున్న పోలీసులు..





