
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి 4: హుజురాబాద్ మునిసిపల్ పరిధిలోని 26వ వార్డులో బుధవారం ప్రజలు, మద్దతు దారులు, ఓటర్లతో కలసి బిఆర్ఎస్ అభ్యర్థిని కేసిరెడ్డి లావణ్య – నరసింహారెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మంగళవారం బుధవారం ఆమె ప్రచారాన్ని ఉదృతంగా వార్డులో ప్రారంభించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలతో ఆమె అన్ని వీధుల్లో ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మూడుసార్లు గెలిచి అభివృద్ధిలో, ప్రజల్లో మంచి పేరు ఉన్న లావణ్యను మరోసారి గెలిపించాలని ప్రజలే ప్రచారం చేశారు. మరోసారి అవకాశం ఇస్తే వార్డులో మరింత గతంలో మాదిరిగా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఆమె ఇంటింటి ప్రచారానికి మంచి స్పందన లభించింది. ఓటర్లకు నమస్కరిస్తూ ఆమె ముందుకు సాగారు. గతంలో నిత్యం అందుబాటులో ఉంటూ చేసిన అభివృద్ధి పనులను వివరించారు. గత నుండి ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రతిరోజు పారిశుద్వాన్ని సమర్థవంతంగా నిర్వహించామని, అలాగే రేషన్ కార్డులు పింఛన్లు, మంజూరుకు కృషి చేశామని, ప్రజలకు ఏ సమస్య వచ్చిన మరో ఐదేళ్లు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ గతంలో వలె పని చేస్తామని తెలిపారు. 26వ వార్డు ప్రజలు తనను ఆదరించారని, వారి ఆదరాభిమానాలు వెలకట్టలేనివని, వారి రుణం ఏమి చేసినా తెచ్చుకోలేనిదని ఆమె ఉద్వేగంగా అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వార్డులో మహిళలు యువత పెద్ద ఎత్తున లావణ్యకు సంఘీభావం ప్రకటించారు. వారి వెంట కిరాణ వర్తక సంఘం అధ్యక్షుడు శీల రాజేంద్రప్రసాద్, వార్డు ప్రముఖులు సంగెం రామస్వామి, ఇనుగాల గోవర్ధన్, మూషం సారంగపాణి, బొల్లి శ్రీనివాస్, పాల కృష్ణమూర్తి, నగునూరి సత్యనారాయణ, పత్తి రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నెస్లే సత్యం, కుడిక్యాల ప్రభాకర్, యాళ్ళ రేణుక, ఇల్లందుల సంజీవ్, రపాల రాజమౌళి, ఇల్లందుల తిరుపతి, ధోని, చల్లూరి ధనలక్ష్మి, మోహన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.










26వ వార్డులోని పలు వీధులలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న బిఆర్ఎస్ అభ్యర్థి కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డి..





