
–రెండో రోజు బిఆర్ఎస్ అభ్యర్థి కేసిరెడ్డి లావణ్య ప్రచారం
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి 5: మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం హుజురాబాద్ పట్టణంలోని 26వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి కేసిరెడ్డి లావణ్య వార్డు మహిళలు బ్రహ్మరథం పట్టారు. ప్రజలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఆమె ప్రచారానికి మంచి స్పందన లభించింది. గతంలో వార్డు లో 💯 శాతం చేసిన అభివృద్ధి పనులను ఆమె వివరించారు. గతంలో గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. మరోసారి అవకాశం ఇవ్వాలని, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ మరింత సేవ చేస్తామని మరింత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వార్డు ప్రజలు గత 15 ఏళ్లలో తమను ఎంతగానో ఆదరించారని వారి రుణం తీర్చుకోవాలని ఆమె అన్నారు. వారి ప్రేమ సహాయ సహకారాలు మరిచిపోలేనని తెలిపారు. హుజురాబాద్లో 26వ వార్డును అన్ని వార్డులలో కెల్లా ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ సక్సెస్ చేసామన్నారు. ఇక్కడి వ్యాపారులు, వైద్యులు, ప్రజలు తమకు ఎంతగానో సహకరించారని గుర్తు చేశారు. ఈనెల 11వ తేదీన ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభం అవుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో ఇనుగాల గోవర్ధన్, పత్తి రాంరెడ్డి, పాల కృష్ణమూర్తి, సంగెం రామస్వామి, కోనేటి రమేశ్, భిమోజు చంద్ర మోహన్, సీను, ఇల్లందుల సంజీవ్, తిరుపతి, ధోని, కుడిక్యాల ప్రభాకర్, యళ్ళ రేణుక, పోకల రంగయ్య, చల్లూరి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.






26వ వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న బిఆర్ఎస్ అభ్యర్థి కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డి..





