
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వడ్లూరి శ్రీలేఖ గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్ కుమార్తె శ్రీలేఖ కావడంతో 22 వ వార్డు ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారు. హుజురాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత తన తండ్రి వడ్లూరి విజయ్ కుమార్ దనీ, రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా హిందూ స్మశాన వాటిక నిర్మాణం, రోడ్ల విస్తరణ, నూతన మురుగు కాలువల నిర్మాణం సిసి రోడ్ల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులను వడ్లూరి విజయ్ కుమార్ చేశారనీ ఆమె పేర్కొన్నారు. 22వ వార్డు సమగ్ర అభివృద్ధియే మాధ్యేయం అని.. మా నాన్న విజయ్ కుమార్ (బ్రహ్మచారి) చేసిన అభివృద్ధిని చూసి తనకు ఓటెయ్యండి అని శ్రీలేఖ విజ్ఞప్తి చేశారు. 22వ వార్డులో తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డును హుజురాబాద్ లోనే కాదు జిల్లాలోనే ఉత్తమ వార్డుగా నిలుపుతానని వడ్లూరి శ్రీలేఖ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆమె ప్రచారానికి అడుగడుగునా ఆ వార్డు ప్రజలు బ్రహ్మరథం పట్టడం కోసం మెరుపు.


తనను గెలిపిస్తే 22వ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చేతులు జోడించి నమస్కరిస్తున్న అభ్యర్థి శ్రీలేఖ..


22వ వార్డులో ఇంటింటా తిరుగుతూ ఓటు అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిని వడ్లూరీ శ్రీలేఖ..





