
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం రోజు రోజుకు పెరుగుతుంది. తాజాగా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 28వ వార్డుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు భాషవేణి భాస్కర్ యాదవ్, అతని అనుచరులతో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ ఇంచార్జి ప్రణవ్. అనంతరం నూతనంగా చేరిన వారు మాట్లాడుతూ 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ దే అని, బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం జరిగిన ప్రజలు మార్పుకు శ్రీకారం చుడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

భాస్కర్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ప్రణవ్

బిజెపి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి తన అనుచరులతో కలిసి చేరిన భాస్కర్ యాదవ్..





