Oplus_16908288
స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
పెద్దపల్లి జిల్లా మంథనిలో రెండు రోజుల క్రితం మరణించిన మంథని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, రైతు బాందవ్యుడు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, దివంగత నేత చందుపట్ల రాంరెడ్డి మృత దేహంపై నాయకులతో కలిసి ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పోలాడి రామారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం వారి కుటుంబ సభ్యులు, నియోజకవర్గ వ్యాప్తంగా వేలాదిగా కదలి వచ్చి భారీ ఎత్తున నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొన్న పోలాడి రామారావు తెలుగు దేశం పార్టీలో రాంరెడ్డితో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుకు తెచ్చుకొని కన్నీటి పర్యంతం అయ్యారు.
ఈసందర్భంగా శిబిరం వద్ద మీడియాతో రామారావు మాట్లాడుతూ నియోజకవర్గ అవభివృద్ధికి విశేషంగా కృషి చేసి ప్రతి పల్లెకు విద్యుత్ సౌకర్యం కల్పించారని, రైతుల చివరి ఆయకట్టు ప్రాంతానికి నీళ్ళు అందించిన రైతు బాందవ్యుడని కొనియాడారు. వామపక్ష తీవ్రవాద ప్రాంతమైన మంథని నియోజకవర్గంలో స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే వారని టైగర్ రాంరెడ్డి గా పేరొందిన రాం రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయం అని పోలాడి రామారావు నివాళులు అర్పిస్తూ, తెలంగాణా రాష్ట్ర సాధనలో ఉద్యమాన్ని ఉర్రూతలూగించారని పేర్కొన్నారు. మిత్రులు రాంరెడ్డి, నేను కలిసి పనిచేసిన అనుభవం ఉందని ఒక మంచి మిత్రుడని కోల్పోవడం బాధాకరమని రామారావు విచారం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాడ శ్రీనివాస్ రెడ్డి, బయ్యపురెడ్డి మురళీధర్ రెడ్డి, చందుపట్ల సుధాకర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఆర్య వైశ్య సంఘాల మాజీ అధ్యక్షుడు తాటిపల్లి రాజన్న, సర్పంచ్ సుదాటీ రవీందర్ రావు, పోతిపెద్ది కిషన్ రెడ్డి, గుజ్జుల రాజిరెడ్డి, ఎల్కోరి సత్యనారాయణ రెడ్డి, తాడిచర్ల రాజేశ్వర్ రావు, గుడాల శ్రీనివాస్, వాల యాదగిరిరావు, మిర్యాల ప్రసాద్ రావు, వామన్ రావు వెంకట్ రెడ్డి లతో పాటు వేలాదిగా కదలి వచ్చిన అభిమానులు తదితరులు ఉన్నారు.






