
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బండ వెన్నెల- నవీన్ ప్రచారంలో గెలుపు బాటలో దూసుకెళ్తున్నారు.
అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని, గత రెండేళ్ల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు ఉండాలని వెన్నెల కోరారు.
అధికారంలో లేని పార్టీలకు ఓటు వేస్తే ఓటు వృధా అవుతుందని, అభివృద్ధి కుంటు పడుతుందని వెన్నెల అన్నారు. ప్రజా ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని, ప్రజా పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఏక కాలంలో రైతు రుణమాఫీ, ప్రతి పంటకు రైతు భరోసా, పంట బోనస్ లాంటి అనేక పథకాలను ప్రజలకు అందిస్తన్నా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారని అన్నారు.

16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బండ వెన్నెల..
కాంగ్రెస్ పార్టీ పథకాలతో పాటు 16వ వార్డుకు సంబంధించి, 12 సూత్రాల హామీలను ప్రకటించి వెన్నెల ముందుకు వెళ్తున్నారు. గతంలో ప్రజాప్రతినిధులుగా కొనసాగిన వారు వార్డ్ అభివృద్ధికి చేసినది శూన్యం అని, తాను గెలిస్తే రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి 16వ వార్డులో చేసి చూపిస్తానని హామీ ఇస్తున్నట్లు వెన్నెల నవీన్ పేర్కొన్నారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి వార్డు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. తన ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంపూర్ణ మద్దతు ప్రకటించి తోడుగా ఉండడం ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది అన్నారు.

ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెల తన మద్దతు దారులు..

16వ వార్డులోని వృద్ధురాలిని ఓట్ అభ్యర్థిస్తున్న బండ వెన్నెల..


16వ వార్డులో వెన్నెల ప్రచారానికి బ్రహ్మరథం పడుతున్న ఓటర్లు..





