
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీఆర్ఎస్ కెసిఆర్ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి పునాది వేసిన పాలన అని, హుజురాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సతీమణి పాడి శాలినిరెడ్డి తెలిపారు.
శనివారం హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శాలినిరెడ్డి 28వ వార్డు, 21వ వార్డులలో అభ్యర్థులు దాసి కుమారస్వామి, వి గోవర్ధన్ లకు మద్దతుగా జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు దిశా నిర్దేశం చేశారు.
హుజురాబాద్ ప్రాంత ప్రజలు స్వయంగా చూసినట్లుగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సరఫరా, రహదారులు, మున్సిపల్ మౌలిక వసతులు, పేదల సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యాయని పేర్కొన్నారు.
రైతుబంధు, రైతు బీమా, కంటి వెలుగు, కెసిఆర్ కిట్టు, వృద్ధులు–వితంతువులు–వికలాంగులకు పెన్షన్లు, కల్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ వంటి పథకాలు పేద కుటుంబాలకు భరోసాగా నిలిచాయని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో తీవ్ర గందరగోళం నెలకొందని, రైతులకు పూర్తి తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు.
సంక్షేమ పథకాలు అస్తవ్యస్తంగా మారాయని విమర్శించారు.
ప్రజలు కోరుకున్న అభివృద్ధి కాకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యలకు బీఆర్ఎస్ పాలనలోనే శాశ్వత పరిష్కారాలు జరిగాయని, మున్సిపాలిటీ అభివృద్ధికి తన భర్త కౌశిక్ రెడ్డి ప్రత్యేక నిధులు తీసుకొచ్చాడని గుర్తు చేశారు.
గత మున్సిపల్ చైర్మన్ గా ఉన్న గందె రాధిక శ్రీనివాస్ హుజురాబాద్ పట్టణంలో కోట్లాది రూపాయలతో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేది, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేస్తూ, హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులైనా దాసి కుమారస్వామి 28వ వార్డ్ లో, 21వ వార్డ్ లో గోవర్ధన్ లను భారీ మెజారిటీతో గెలిపించి, కేసీఆర్ నాయకత్వంపై మరోసారి విశ్వాసం ప్రకటించాలని ఆయా వార్డుల ప్రజలకు పాడి శాలినిరెడ్డి పేరుపేరునా విజ్ఞప్తి చేశారు.
ఒక్క అవకాశం ఇవ్వండి!.. ప్రతి ఒక్కరికి ఇంటివాడిలా అండగా ఉంటా..!
–28వ వార్డ్ బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి దాసి కుమారస్వామి..
తనకు 28వ వార్డులో కౌన్సిలర్ గా ఒక అవకాశం ఇస్తే అందరిలో ఇంటిలో ఒక వాడిగా ఉండి ఎలాంటి సమస్య వచ్చిన శక్తి వంచన లేకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తానని 28వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి దాసి కుమారస్వామి పేర్కొన్నారు. తాను వార్డు ప్రజలకు కూత వేటు దూరంలో ఉంటానని ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న, ఎలాంటి ఇతర సమస్యలు ఉన్న తనను ఫోన్లో సంప్రదిస్తే ఏలాంటి లాభాపేక్ష ఆశించకుండా నిస్వార్ధంగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తన శక్తి మేరకు వార్డు ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి అన్ని విధాలుగా వార్డును తీర్చిదిద్దుతానన్నారు. తన కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే వార్డు ప్రజలను గుండెలో పెట్టుకొని చూసుకుంటానని, ఇచ్చిన మాట తప్పకుండా హామీలన్నీ నెరవేరుస్తానని కుమారస్వామి స్పష్టం చేశారు.

28వ వార్డులో ఓటు అభ్యర్థిస్తున్న ఎమ్మెల్యే సతీమణి శాలినిరెడ్డి..


28వ, 21వ వార్డుల బిఆర్ఎస్ అభ్యర్థులు దాసి కుమారస్వామి, వి గోవర్ధన్లను గెలిపించాలని పిలుపునిస్తున్న ఎమ్మెల్యే సతీమణి శాలినిరెడ్డి..

.

తమ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్న 28వ అభ్యర్థి దాసి కుమారస్వామి..





