
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బల్దియా ఎన్నికల్లో భాగంగా పట్టణంలో 29వేల 531 మంది ఓటర్లు ఉండగా నలుగురు థర్డ్ జెండర్లు ఓటర్లుగా నమోదయ్యారు. అయితే ఆ నలుగురు మూడుచోట్ల తమ ఓటు హక్కును 100%శాతం వినియోగించుకుని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. పట్టణంలోని గాంధీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కుమారి, రవళి అనే ఇద్దరు తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. కృష్ణవేణి పబ్లిక్ స్కూల్లో రాజి, కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో సత్తెమ్మ అనే నలుగురు ట్రాన్స్ జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని నేటి యువతీ యువకులకు ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని చాటి చెప్పి ఆదర్శంగా నిలిచారు.





