
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాజకీయాలు ఎన్నికల సమయం వరకేనని ఆ తర్వాత అందరం అన్నదమ్ముల వలె కలిసి ఉంటామని నిరూపించారు ఈ వార్డులో పోటీ చేసిన అధికార, ప్రతిపక్షాలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు.
ఈరోజు సాయంత్రం వరకు నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీగా పోటీపడిన అధికార, ప్రతిపక్షాలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు సాయంత్రం పోలింగ్ ముగిసే ఐదు నిమిషాల ముందు కలుసుకొని ఒకరి జబ్బలపై మరొకరు చేయి వేసుకొని నవ్వుతూ.. మాలో ఎవరు గెలిచినా ఇద్దరం గెలిచినట్టే ! అంటూ సంతోషం వ్యక్తం చేయడం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. వివరాలలోకి వెళితే.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డు జనరల్ లో పోటీ చేసిన అధికార పార్టీకి చెందిన రావుల ప్రభాకర్, బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన గందె శ్రీనివాస్ లు ఎన్నికల్లో తను గెలవాలంటే తను గెలవాలంటు హోరాహోరియా తలపడి ఓటర్లకు పోటీపడి తాయిలలు ప్రకటించి పెద్ద ఎత్తున మున్సిపల్ పరిధిలోనే అత్యధిక కాసులు ఓటుగా ఎక్కువ ఖర్చుపెట్టిన వారిగా ప్రచారం జరగగా.. సాయంత్రం మాత్రం ఇద్దరూ ఒకటే ఒకే చోట కలిసి స్వీట్ తిని, చాయ్ తాగి ఇద్దరు విక్టరీ చూపెడుతూ తమలో ఎవరు గెలిచినా సంతోషమే.. ఎవరూ గెలిచిన ఇద్దరం గెలిచినట్లే అని పేర్కొనడం వారి స్పోర్టివ్ స్పిరిట్ కి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ ఇద్దరు ఎంతో సంతోషంగా విక్టరీ చూపుతూ సంతోషం వ్యక్తం చేయడం కోసమేరుపు.


మూడో వార్డులో నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డ అధికార, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు ప్రభాకర్, శ్రీనివాస్ సాయంత్రం ఏకమై సంతోషం వ్యక్తం చేస్తున్న దృశ్యం.





