
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపాలిటీ పాలకవర్గ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 16 నుండి 17 వరకు హుజురాబాద్ పట్టణంలో 163 సెక్షన్ అమలులో ఉంటుందని హుజురాబాద్ టౌన్ సిఐ టీ కరుణాకర్ అన్నారు. సోమవారం హుజురాబాద్ మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికల కార్యక్రమం ఉన్నందున సోమవారం ఉదయం నుండి మంగళవారం ఉదయం వరకు 163 సెక్షన్ అమలులో ఉంటుందని నలుగురి కన్నా ఎక్కువ మంది గుమిగూడి ఉండరాదని, సభలు సమావేశాలు అనుమతి లేకుండా నిర్వహించరాదని ఊరేగింపులు సైతం చేయరాదని ఆయన తెలిపారు.ఆయన వెంట ఎస్సై యునస్ ఉన్నారు.





