
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి 17: హుజురాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలలో గెలుపొంది మెజార్టీ సీట్లకు కైవసం చేసుకొని చైర్మన్ పీఠంను దక్కించుకుని నిన్న చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గాంధీనగర్ కు చెందిన రోంటాల సుహాసిని మంగళవారం బీసీ ఆజాది ఫెడరేషన్ హుజురాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేసారు. తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్ ను అన్ని విధాల అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే హుజురాబాద్ మునిసిపాలిటీని నెంబర్ వన్ స్థానాన్ని ఉంచాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాద్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకమారి శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్, హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు పంజాల తిరుపతిగౌడ్, మండల అధ్యక్షులు నడిగోటి రమేష్, మమునూరి ప్రవీణ్ కుమార్, కొలిపాక క్రాంతికుమార్, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ కొత్తూరి జీవన్ కుమార్, జేఏసీ జిల్లా అధ్యక్షులు చిట్యాల భాను, ములుగు సతీష్, కందుకూరి భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ సుహాసిని దంపతులను బీసీ ఆజాది ఫెడరేషన్ హుజురాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న దృశ్యం.






