
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: బిజెపి హుజురాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావుల అక్రమ అరెస్టును నిరసిస్తూ సోమవారం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా
వారు మాట్లాడుతూ ఒకవైపు బిజెపి ఎమ్మెల్యేలపై దాడులు మరోవైపు హిందువులపై దారుణమైన అకృత్యాలు జరుగుతున్న ఈ అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావుని, బిజెపి ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను అక్రమంగా అరెస్టు చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. ప్రశ్నించిన వారిని అక్రమ అరెస్టు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు చర్య మానుకోవాలని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, బిజెపి సీనియర్ నాయకులు కొలిపాక శ్రీనివాస్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు తూముల శ్రీనివాస్, నరాల రాజశేఖర్, యాంసాని శశిధర్, ఓడ్నాల విజయ్, బొరగాల సారయ్య, గంట సంపత్, డోరి ఐలయ్య, కొడిమ్యాల పవన్ కుమార్, శ్రీధర్, కుథాడి కుమారస్వామి, మోటపోతుల రాకేష్, దున్నపోతుల అశోక్, రాజేష్ ఖన్నా, క్యాశ వెంకటేష్, నీలం రవీందర్, రామచంద్రం, బోడిగే శూదర్శన్, తూర్పాటి రాజశేఖర్, పర్థం విజయ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న బిజెపి నాయకులు, కార్యకర్తలు..





