Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అమెరికాలో మంచి ఉద్యోగాన్ని వదులుకొని.. హీరోగా మారాలన్న తన ఆశయాన్ని అందిపుచ్చుకుని…’ రవం ‘ సినిమాతో తన కోరిక నెరవేర్చుకొని తెలుగు ప్రజలను త్వరలోనే ఆకట్టుకోనున్నడు. వివరాలలోకి వెళితే.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణం విద్యానగర్‌కు చెందిన రాధారపు ప్రశాంత్ తన చిన్నప్పటి నుండి వెండితెరపై మెరవాలన్న కలని నిజం చేసుకున్నాడు. సినిమా రంగంపై ఉన్న మక్కువతో, ఆ యవకుడు అమెరికాలో స్థిరపడ్డ తన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని, సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. తాజాగా ప్రశాంత్ హీరోగా నటించిన ‘రవం’ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో 6న విడుదలకు సిద్ధమైంది. పాడాల తారక రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ మన్నార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా ప్రశాంత్ తన నటనా ప్రతిభను చాటుకోనున్నారు. హర్రర్ అండ్ సస్పెన్స్ తో కూడిన ఈ చిత్రం ఈ నెల 6న ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సందర్భంగా, హుజూరాబాద్‌లోని ప్రశాంత్ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రశాంత్ తండ్రి రాధారపు కనకయ్య ఒక సామాన్యమైన వ్యక్తి. అతని సొంత గ్రామం సైదాపూర్ మండలం జాగిరిపల్లి కాగా పాతికేళ్ల క్రితమే హుజురాబాద్ పట్టణంలోని విద్యానగర్‌లో స్థిరపడ్డారు. స్వయంకృషితో ఈ స్థాయికి వచ్చిన ప్రశాంత్ భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని, ఆతనికి మరిన్ని విజయాలు కలగాలని కోరుకుంటున్నారు.

రాధారపు ప్రశాంత్ నటించిన ‘రవం.’.





