
.-ఏప్రిల్ 28న లక్ష మందితో ఓసి ఐకాస, రైతు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ లో రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమరభేరి భారీ బహిరంగ సభ.
ఓసి జేఏసీ, రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
–ఓసి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డిలు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: అన్నదాతల పండించిన అన్ని రకాల పంటలకు తగిన రీతిలో గిట్టుబాటు ధరలు కల్పించాలనీ ఓసి జేఏసీ, రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఓసి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డిలు డిమాండ్ చేశారు.
అన్న దాతలు పండించిన అన్ని రకాల పంటలకు తగిన రీతిలో గిట్టుబాటు ధరలు కల్పించాలని, వ్యవసాయదారుల భాగస్వామ్యంతో రైతుల గిట్టుబాటు ధరపై ప్రత్యేక చట్టం తీసుకు రావాలని, ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలని, రైతు భీమా వయోపరిమితిని 70ఏళ్లకు పెంచాలని, ఆర్ధికంగా వెనుకడిన బడిన అగ్ర కుల పేదల సంక్షేమం కోసం జాతీయ స్థాయి ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని, డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 28న కరీంనగర్ లో ఓసి జేఏసీ, రైతు ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సంయుక్తంగా కరీంనగర్ లో లక్షమందితో రాష్ట్ర స్థాయి రైతుల మహగర్జన సమర భేరి భారీ బహిరంగ సభను నిర్వహించ తలపెట్టిన ట్లు ఓసి జేఏసీ, రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఓసి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డిలు వెల్లడించారు.

ఈ మేరకు కరీంనగర్ లో మంగళవారం రైతు మిత్ర రాష్ట్ర ప్రథాన కార్యదర్శి, ఓసి జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చందుపట్ల నరసింహ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఓసి జేఏసీ రాష్ట్ర కమిటీ నాయకులు ఉమ్మడి జిల్లా ఐకాస నాయకుల సమావేశంలో అన్నదాతల సమస్యలపై ప్రథాన ఎజెండా గా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఓసి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రస్తుతం అమలు జరుగుతున్న గిట్టుబాటు ధరలు అన్న దాతలకు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేనే లేవని రైతులు తాను పండించిన పంటలకు రైతులే గిట్టు బాటు ధరలను నిర్ణయించుకునే అవకాశం కల్పించే విధంగా జాతీయ స్థాయిలో రైతు గిట్టుబాటు ధర పై ప్రత్యేక చట్టం తీసుకు రావాలని డిమాండ్ చేశారు. రైతు భీమా వయో పరిమితిని 70ఏళ్లకు పెంచాలని కోరారు. 50ఏళ్లు నిండిన ప్రతి రైతుకు నెలకు 5వేల పెన్షన్ సౌకర్యం కల్పించారని డిమాండ్ చేశారు.
ప్రతి రైతుకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు 10లక్షల వరకు ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రస్తుత పరిస్తుతలో కూలీల కొరత పెరుగుతున్న ఖర్చులు అణిచ్చిత వాతావరణమ్ ఇలా సవాలక్ష ప్రశ్నలతో అన్న దాతలు ప్రతికూల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెరగడం తో పాటు వ్యవసాయరంగాన్ని బలోపితం చేయాలంటే జాతీయ ఉపాధి పథకంలో వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్ధికంగా వెనుకబడిన అగ్ర పేదల సంక్షేమం కోసం జాతీయ స్థాయి ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని, కేంద్రం రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేయటానికి ఓకె రకమైన అర్హతల ఆదాయ వయోపరిమితి 10లక్షల వరకు కల్పించాలని, ఈడబ్ల్యూఎస్ అర్హతకు అధికారుల జారీ చేసే సర్టిఫికెట్ ఎలాంటి నిబంధనలు లేకుండా 5ఏళ్ల వరకు వర్తింపజేయాలని ఈ డబ్ల్యూఎస్ బ్యాక్ లాగ్ పోస్టులను కేటాయించగా భర్తీ కాకుండా మిగిలి పోయిన పోస్టులను ఈడబ్ల్యూఎస్ వారి చే వెంటనే భర్తీ చేయాలని, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఓసి జేఏసీ,రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఓసి ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డిలు డిమాండ్లు చేశారు. తమ డిమాండ్ల సాధనకు ఏప్రిల్ 28న కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఓసి జేఏసీ, రైతు ప్రజాసంఘాల సమాఖ్య సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమర భేరి భారీ బహిరంగ సభ కు పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు హాజరై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించే విధంగా విజయవంతం చేయాలని పోలాడి రామారావు గోపు జైపాల్ రెడ్డి లు కోరుతూ పవిత్ర హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలాడి రామారావుతో పాటు ఓసి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, రైతుమిత్ర రాష్ట్ర ప్రథాన కార్యదర్శి, ఓసి జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందుపట్ల నరసింహరెడ్డి, ఓసి జేఏసీ రాష్ర సలహాదారు రావుల నరసింహారెడ్డి, నాయకులు దడిగేల వెంకటేశ్వర్ రావు, రాచమడుగు నరసింహా రావు, వెన్నమనేని విక్రమ నరసింహరావు, మహంకాళి రాజన్న, కంకణాల వీరారెడ్డి రాయపాటి వెంకటేశ్వర్ రావు, కరివేద సుధాకర్ రెడ్డి, జనగామ కరుణాకర్ రావు, గుడాల శ్రీనివాస్, ఉన్నం అంజయ్య, తణుకు ప్రభాకర్, గౌతం శర్మ తదితరుల తో పాటు వివిధ జిల్లాల, రాష్ట్ర రైతు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..





