Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: చంద్రగ్రహణం అనంతరం మంగళవారం సాయంత్రం హుజురాబాద్ పట్టణంలోని రామాలయం, కృష్ణలయం, ఆంజనేయస్వామి ఆలయం, అయ్యప్పస్వామి దేవాలయాలు తెరుచుకున్నాయి. పాల్గుణ మాసం పౌర్ణమి తిథి మంగళవారం రోజున చంద్రగ్రహణం ఏర్పడడంతో ఉదయం రోజువారి పూజల అనంతరం తొమ్మిది గంటలకు దేవాలయాలన్నీ వేద పండితులు మూసివేశారు. సాయంత్రం చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత దేవాలయాలను తెరిచి సంప్రోక్షణ చేసిన అనంతరం అభిషేకాలు నిర్వహించినట్లు రామాలయ అర్చకులు శ్రీధరాచార్యులు తెలిపారు.
తెరుచుకున్న దేవాలయము


చంద్రగ్రహణం




