
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంట ఎక్స్‌రోడ్డు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ గ్రామానికి చెందిన చిలుక ప్రదీప్ కుమార్, తాటికొండ సాయికిరణ్ లు బైక్‌పై ప్రయాణిస్తుండగా చాకుంట ఎక్స్‌రోడ్డు వద్ద అతివేగంగా వచ్చిన లారీ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం తీవ్రతతో వారి తలలు నుజ్జునుజ్జు అయ్యాయని స్థానికులు తెలిపారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో రుక్మాపూర్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిలుక ప్రదీప్ కుమార్, తాటికొండ సాయికిరణ్ లు..





