
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో శుక్రవారం జరిగిన పలు వివాహ వేడుకల్లో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు నూతన వధూవరులను ఆశీర్వదించారు. హుజురాబాద్ పట్టణ శివారులోని సువర్ణ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మోటపోతుల విక్రమ్ గౌడ్ – చామంతిల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం సింగపూర్ గ్రామంలో చుంచు సదానందం కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొని వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని, మాజీ చైర్మన్ వడ్లూరి విజయకుమార్, ఏరియా ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ నల్ల నారాయణరెడ్డి, కౌన్సిలర్లు ప్రతాప మంజుల కృష్ణ, జున్నుతుల భాస్కర్, మేకల తిరుపతి, సొల్లు బాబు, సందమల్ల బాబు చింత శ్రీనివాస్, గుర్రం హరిబాబు, శ్రీనివాస్ గౌడ్, రావుల వెంకట్, మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

మోటపోతుల విక్రమ్ గౌడ్ – చామంతిల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న ప్రణవ్ బాబు, కాంగ్రెస్ నాయకులు..





