
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
గర్భాశయ క్యాన్సర్ ను నివారించేందుకు వేసే హెచ్ పి వి వ్యాక్సిలేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిని డాక్టర్
సాజిదా అన్సారి అన్నారు. శుక్రవారం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం కోసం హుజురాబాద్ డిప్యూటీ డిఎం, హెచ్ ఓ డాక్టర్ చందు, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నల్ల నారాయణరెడ్డిలతో కలిసి సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… హుజురాబాద్ పరిధిలో హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో జమ్మికుంటలో వాక్సినేషన్ కార్యక్రమం ఈనెల 8వ తేదీ నుండి ప్రారంభమవుతుందన్నారు. ఈ వ్యాక్సినేషన్ 14 సంవత్సరాలు నిండిన బాలికలకు మాత్రమే వేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో 9936 మంది 14 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారని, వారిలో 23 13 మందికి వేయడం జరుగుతుందన్నారు. వ్యాక్సినేషన్ వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉండవని అపోహలు పెట్టుకోరాదని ఆమె అన్నారు. ఇప్పటికే14 సంవత్సరాలు నిండిన పిల్లలను గుర్తించడం జరిగిందని ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు వారిని తీసుకొని వచ్చి టీకాలు వేయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చేల్పూర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ తులసీదాస్, డాక్టర్ పి శ్రీకాంత్ రెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సదానందం,డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ గౌడ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ గురించి సూపరిండెంట్ నారాయణరెడ్డిని వివరాలు అడిగి తెలుసుకుంటున్న జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిని డాక్టర్ సాజిదా అన్సారి





