
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ రోoటాల సుహాసిని, వైస్ చైర్ పర్సన్ గూడూరు అంజలి మున్సిపల్ మహిళ కార్మికులను, మెప్మా మహిళా సిబ్బందిని ఘనంగా సన్మానించారు. అనంతరం చైర్ పర్సన్ సుహాసిని, వైస్ చైర్ పర్సన్ అంజలీలను వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ అహ్మద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
—మహిళ ప్రతినిధులు అంటే ఇద్దరేనా..!?
శనివారం హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు జరగగా కేవలం చైర్పర్సన్, వైస్ చైర్ పర్సన్ లు మాత్రమే పాల్గొనడం పట్ల పలువురు మహిళ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మన్సిపల్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కేవలం ఇద్దరు మాత్రమే పాల్గొనడం మిగతా వారికి సమాచారం లేకపోవడాన్ని, తమను పిలవకపోవడాన్ని మిగతా మహిళా కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ పాలకవర్గంలో మొత్తం 17 మంది మహిళ కౌన్సిలర్లు ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే పాల్గొనడం వారి చేతనే కార్యక్రమం జరిపించడం తమను అవమానించినట్లేనని కౌన్సిలర్లు అభిప్రాయ పడుతున్నారు. బిఆర్ఎస్, బిజెపి కౌన్సిలర్ కే కాకుండా, కాంగ్రెస్ మహిళా కౌన్సిలర్ల సైతం సమాచారం లేదని, మున్సిపల్ అధికారులు సైతం ఈ వ్యవహారంలో ప్రేక్షక పాత్ర వహించడం ఏమిటని అంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కార్యక్రమాలు చేపడితే తప్పనిసరిగా అందరికీ సమాచారం ఇవ్వాలని వారు అంటున్నారు.











