Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో హుజురాబాద్ మండలంలోని పెద్ద పాపయ్యపల్లి, సిర్సపల్లి, జూపాక, రాంపూర్ వివిధ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పెన్నులు పంచడం జరిగింది.
“సోల్జర్కు గన్ను – స్టూడెంట్కు పెన్ను” అనే నినాదంతో శ్రీ సురేష్ ఆత్మారామ్ మహరాజ్ గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది జక్కుల శ్రీనివాస్ మరియు యోగ మాస్టర్ దేవనూరి శ్రీనివాస్ మాట్లాడుతూ హుజురాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు సరస్వతి కటాక్షం కలిగిన పెన్నులు పంపిణీ చేశారు. రాబోయే పబ్లిక్ పరీక్షలను ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనాలని విద్యార్థులకు వారు సూచించారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదల అవసరమని పేర్కొన్నారు. ఈ సహాయం వారి విద్యాభ్యాసానికి దోహదపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఈఓ విడపు శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు తదితరులు పాల్గొని తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థను మరియు
జక్కుల శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలిపారు.

పిల్లలకు పెన్నులు పంపిణీ చేసిన అనంతరం విద్యార్థులతోప్రముఖ న్యాయవాది జక్కుల శ్రీనివాస్, ఎంఈఓ శ్రీనివాస్..





