మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో హుజురాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో ఈ నెల 10(నేటి)నుండి ఏప్రిల్ 9 వరకు నిర్వహిస్తున్నట్లు సింగాపూర్ గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ… పాడి పశువులకు 8వ విడత ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించబడుతుందని, కావున రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.





