
–మద్దతు ప్రకటించిన రైతు ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటూ రైతులను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, రైతులను అవహేళన చేస్తూ చేస్తూ సిఎం రేవంత్ రెడ్డి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయని రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రైతు మిత్ర ప్రజాసంఘాలరాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి, రాష్ట్ర ప్రథాన కార్యదర్శి చందుపట్ల నరసింహరెడ్డి, ఉపాధ్యక్షులు ఎడవెల్లి కొండాల్ రెడ్డి లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సిఎం రేవంత్ విచక్షణ కోల్పోయి గతంలో ఓసిలోని ఒక సామాజిక వర్గాన్ని. జాతి నెపంతో అవహేళన చేశారని ఇప్పుడు అన్నం పెట్టే రైతన్నలను ఆత్మ గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆవేదన చెందారు. రైతు భరోసా నిధులు ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందు విడుదల చేయాలని, లేకుంటే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 16న వేలాది మంది రైతులతో అసెంబ్లీనీ శాంతి యుత మార్గంలో త్రిముఖ వ్యూహంతో అష్ట దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. రైతన్నల ఆగ్రహానికి గురి కాకముందే ప్రభుత్వం తక్షణమే రైతు భరోసా నిధులు విడుదల చేసి పరువు కాపాడుకోవాలని హితవు పలికారు. గతంలో ఇదే కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడు 1990-91లో రైతు వ్యతిరేక విధానాల పై అప్పటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు ముద్దసాని దామోదర్ రెడ్డితో కలిసి తాము 60 వేల మంది రైతులతో 600 ట్రాక్టర్లతో 200 బస్సులు, 300 లారీల ద్వారా తన సూచనలతో మా ప్రత్యేక కృషి ద్వారా కరీంనగర్ లో రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వాన్ని గడ గడ లాదించామని రామారావు పేర్కొన్నారు ఇప్పుడు అదేవిధంగా తమ సత్తా ఏమిటో ఏప్రిల్ 28న నిర్వహించే రైతు మహాగర్జన సమర భేరి ద్వారా ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల ను ఎండగడుతామని సవాల్ విసిరారు.
కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. పైన లేవనెత్తిన అన్నదాతల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 14 హుజురాబాద్ డివిజన్ ఐకాస, రైతు ప్రజా సంఘాల నాయకుడు ముచ్చా సమ్మిరెడ్డి హుజురాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంగా మంగళవారం హుజురాబాద్ లో ఐకాస రాష్ట్ర, వివిధ జిల్లాల ముఖ్య నేతలతో రైతు ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలాడి రామారావు తో పాటు రైతుమిత్ర ప్రజాసంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామి రెడ్డి, ప్రథాన కార్యదర్శి చందుపట్ల నరసింహ రెడ్డి మాట్లాడుతూ అన్నదాతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ హుజురాబాద్ లో14 వ తేదీన నిరవరదిక నిరాహార దీక్షకు పూనుకున్న హుజురాబాద్ ప్రాంత రైతు ప్రజాసంఘాల నాయకుడు మచ్చా సమ్మిరెడ్డికి మద్దతుగా తాము ఒక రోజు సంఘీభావంగా దీక్షలో తొలి రోజు తాము పాల్గొంటున్నట్లు ప్రకటించారు. రైతుల పంటలపై
ప్రస్తుతం అమలు జరుగుతున్న గిట్టు బాటు ధరలు అన్న దాతలకు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేనే లేవని రైతులు పండించిన పంటలకు రైతులే గిట్టు బాటు ధరలను నిర్ణయించుకునే అవకాశం కల్పించే విధంగా జాతీయ స్థాయిలో ప్రత్యేక చట్టం తీసుకు రావాలని. గ్రామీణ ప్రాంతాలలో ప్రస్తుత పరిస్థితుల్లో కూలీల కొరత పెరుగుతోందని, ఖర్చులు బాగా పెరిగి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైతుల వ్యవసాయ రంగానికి చేయూత నిచేందుకు, గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వ్యవసాయ రంగాన్ని బలోపితం చెయ్యాలంటే జాతీయ ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ రంగాన్ని తక్షణమే అనుసంధానం చేయాలన్నారు.
రైతు భీమా వయోపరిమితిని 70ఏళ్లకు పెంచాలని, 50ఏళ్లు నిండిన రైతులకు నెలకు కనీసం 6వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని సమావేశంలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేసారు. కార్యక్రమంలో నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్న హుజురాబాద్ ప్రాంత రైతు ప్రజాసంఘాల నాయకుడు ముచ్చా సమ్మిరెడ్డి, రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రైతు మిత్ర ప్రజా సంఘాల సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి, ప్రథాన కార్యదర్శి చందుపట్ల నరసింహరెడ్డి, కార్యదర్శి పసుల స్వామి, ఓసి ఐకాస రాష్ట్ర నాయకులు ఎడవెల్లి కొండాల్ రెడ్డి, పోరెడ్డి కిషన్ రెడ్డి, కొనిశెట్టి మునీందర్, కంకణాల సరోజన, జనార్ధన్ రెడ్డి, కొన్నే సమ్మిరెడ్డి, వి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..


అభివాదం చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్న హుజురాబాద్ ప్రాంత రైతు ప్రజాసంఘాల నాయకుడు ముచ్చా సమ్మిరెడ్డి, రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రైతు మిత్ర ప్రజా సంఘాల సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి, ప్రథాన కార్యదర్శి చందుపట్ల నరసింహరెడ్డి, కార్యదర్శి పసుల స్వామి, ఓసి ఐకాస రాష్ట్ర నాయకులు ఎడవెల్లి కొండాల్ రెడ్డి, పోరెడ్డి కిషన్ రెడ్డి, కొనిశెట్టి మునీందర్, కంకణాల సరోజన, జనార్ధన్ రెడ్డి, కొన్నే సమ్మిరెడ్డి, వి వెంకట్ రెడ్డి తదితరులు..





