
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
కరీంనగర్ జిల్లాలోని గంగాధర, రామడుగు తిమ్మాపూర, మానకొండూర్, శంకరపట్నం, వీణవంక, సైదాపూర్, జమ్మికుంట, హుజురాబాద్, గన్నేరువరం మండలాల పరిధిలోని సర్పంచులతో రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ఆత్మీయ అవగాహన సమావేశంలో ఏప్రిల్ 28న ఓసి ఐకాస, రైతు ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో లక్ష మందితో నిర్వహించే రాష్ట్రస్థాయి రైతు మహాగర్జన సమరభేరి సభకు సమావేశంలో పాల్గొన్న 200 మంది సర్పంచులను ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను అందజేసి వారిచే మహగర్జన గోడ ప్రతులను పోలాడి రామారావు ఆవిష్కరింప జేసారు. ఈసందర్భంగా రామారావు మాట్లాడుతూ పార్టీల కతీతంగా నిర్వహించే రైతుల మహాగర్జన సమర భేరి సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే 20 వేల మంది రైతులను తరలించే బాధ్యత సర్పంచుల దేనని రామారావు కోరగా అందుకు సానుకూలంగా స్పందించి తామే బాధ్యత తీసుకుంటామని ప్రకటించినందులకు రామారావు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఓసిల కార్పొరేషన్ లకు పాలకమండళ్ళు ఏర్పాటుచేసి 3 వేల కోట్ల నిధులను కేటాయించాలని రైతు భరోసా నిధులు తక్షణమే విడుదల చేయాలని ఈనెల 14న రైతు ప్రజాసంఘాల సమాఖ్య నాయకుడు ముచ్ఛా సమ్మిరెడ్డి హుజురాబాద్ లో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారని, 16 వ తేదీన ఓసి ఐకాస రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది అన్నదాతలతో కలిసి అసెంబ్లీ ముట్టడిస్తామని రామారావు హెచ్చరించారు. రైతులకు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులను అవహేళన చేస్తూ సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే సిఎం రేవంత్ సర్కార్ అన్నదాతల సంక్షేమంపై నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. 50 ఏళ్లు దాటిన ప్రతి రైతుకు నెలకు ఆరు వేల పెన్షన్ మంజూరు చేయాలని, రైతు భీమా వయో పరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, రైతులకు అన్ని విభాగాల్లో 20 లక్షల ఉచిత వైద్యసౌకర్యం ఏర్పాటుకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, జాతీయ ఉపాధి హామీ పథకం తో వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేయాలని రైతుకు గిట్టుబాటు ధర నిర్ణయించే రైతుల భాగస్వామ్యంతో ఉండే రైతు చట్టం తీవాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 28న లక్ష మందితో కరీంనగర్ లో రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమర భేరి సభను నిర్వహిస్తున్నామని అన్ని పార్టీల వారిని ఆహ్వానిస్తున్నామని పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పోలాడి రామారావు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఓసి ఐకాస జిల్లా అధ్యక్షుడు ఏనుగు చొక్కారెడ్డి, నాయకులు రాచ మడుగు నరసింహా రావు, తణుకు ప్రభాకర్, కొత్తకొండ రవీందర్ రావు, వేముల సుదర్శన్ రెడ్డి, బీరెడ్డి కరుణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.








సర్పంచులను ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను అందజేసి వారిచే మహగర్జన గోడ ప్రతులను ఆవిష్కరింపజేస్తున్న జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు






