
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, మార్చి 14: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా హుజురాబాద్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో శనివారం ప్రత్యేక వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా పలువురికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ డిప్యూటి డిఎంహెచ్ ఓ డాక్టర్ చందు ఈ కార్యక్రమంలో 186 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అందులో 41 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటి డిఎంహెచ్ డాక్టర్ చందు మాట్లాడుతూ 14 సంవత్సరాలు నిండిన వారు తప్పనిసరిగా గర్భాశయ క్యాన్సర్ కు ముందస్తు నివారణగా హెచ్.పి.వి వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, సిహెచ్ఓ సదానందం, చెల్పూర్ వైద్యాధికారి డాక్టర్ తులసీదాస్, డాక్టర్ మహమ్మద్ హరీష్, కంటి వైద్యులు డాక్టర్ సౌమ్య, స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ సాయిదీప్, కీళ్లు, ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ రాజరెడ్డి, డాక్టర్ భరద్వాజ్, మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ బి కిరణ్, ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.





ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు చేసిన వైద్య సిబ్బందిని, బల్దియా సిబ్బందినీ వివరాలు అడిగి తెలుసుకుంటున్న చైర్పర్సన్ సుహాసిని..





