
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రైతు ప్రజా సంఘాల కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ముచ్చా సమ్మిరెడ్డి హుజురాబాద్ లో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు అన్నీ వర్గాల మద్దతుతో అనూహ్య స్పందన లభించిందని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.
అన్న దాతల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ రైతు ప్రజాసంఘాల జేఏసీ నాయకుడు ముచ్చా సమ్మిరెడ్డి శనివారం 14వ తేదీ నుంచి హుజురాబాద్ లో చేపట్టిన నిరవధిక దీక్ష రెండవ రోజుకు చేరడంతో పార్టీల కతీతంగా రాష్ట్ర ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులు, ప్రజా సంఘాల నాయకులు తరలి వచ్చి సంఘీభావం ప్రకటించారు.
అన్న దాతలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ ఆరోపించారు. ఒక పక్క మరో 15 రోజుల్లో పంటలు కోతకు వచ్చే దశకు చేరుకున్న నేటికీ రైతు భరోసా నిధులు విడుదల చేయడం లేదని, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు.
కేవలం సన్న రకాలకు అడపా దడపా బోనస్ ఇస్తూ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. అన్నీ రకాల ధాన్యాలకు పంటల కొనుగోళ్ల సమయంలోనే 500 బోనస్ ఇవ్వాలని, పంట సాగు సమయంలోనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు, 50 ఏళ్లు దాటిన ప్రతి రైతుకు నెలకు రూ ఆరు వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రైతు భీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, రైతులకు అన్ని రకాల ఆరోగ్య సమస్యల వైద్య ఖర్చులకు 20 లక్షల రూపాయల అందించుటకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, ఓసిల సంక్షేమానికి ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు పాలక మండల్లులను ఏర్పాటు చేసి ప్రణాళిక పద్దు కింద తక్షణమే మూడు వేల కోట్ల నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా నిధులు తక్షణమే విడుదల చేయక పోతే 16న ఓసి జేఏసీ, రైతు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది రైతులతో శాంతి యుతంగా అసెంబ్లీ గేటు ఎదుట బైటాయించి నిరసన తెలుపుదామని పోలాడి రామారావు వెల్లడించారు. రైతుల డిమాండ్ల సాధనకు ఓసి, రైతు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 28న లక్ష మందితో కరీంనగర్ లో రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమర భేరి సభను నిర్వహించనున్నామని పోలాడి వెల్లడించారు.
రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మచ్చా సమ్మిరెడ్డి చేపట్టిన రెండవ రోజు చేపట్టిన నిరవధిక దీక్ష కు వివిధ జిల్లాల కుల సంఘాల రాష్ట్ర జిల్లా నాయకులు భారీ ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేశారని శిబిర నిర్వాహకులు పోలాడి రామారావు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ముచ్చా సమ్మిరెడ్డికి రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ తణుకు సమ్మయ్య లు జ్యూస్ ఇచ్చి దీక్షను విరమింపజేశారు. తన దీక్షకు సహకరించిన అన్నీ ప్రజా సంఘాల నాయకులకు వివిధ పార్టీల నాయకుల కు ప్రతి ఒక్కరికీ దన్యవాదాలు తెలుపుతున్నట్లు ముచ్చా సమ్మిరెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి జోజీరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వెంకట్రాజం, సింగిల్ విండో చైర్మన్లు ఎడవెల్లి కొండాలరెడ్డి, వినియోగదారుల ఫోరం కన్వీనర్ చందాగాంది, కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నర్సింహారెడ్డి, సర్పంచ్ పోల్సాని రామారావు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి సమ్మయ్య, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అంబేద్కర్ సంఘం జిల్లా కార్యదర్శి మాడుగుల ఓదెలు, డీటీఎఫ్ రాష్ర్ట అడిట్ కమిటీ కన్వీనర్ పల్కల ఈశ్వర్ రెడ్డి, సామాజిక సేవకురాలు అకినేపెళ్లి శిరీష, టీడీపీ పార్లమెంటు నాయకుడు ఎస్ కే ఫయాజ్, కంకణాల జనార్ధన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, బొక్కల రాంరెడ్డి, కొలిపాక శ్రీనివాస్, తాల్లపెల్లి రాయమల్లు, భీమగోని సురేష్ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించి మాట్లాడి మద్దతు పలికారు.




దీక్ష చేపట్టిన సమ్మిరెడ్డికి నిమ్మ రసం ఇచ్చి దీక్ష పిరమింప చేస్తున్న జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..





