
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆశయాలను ఆచరణలో ఓట్ల రూపంలో అమలు చేసి నిరూపించి భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో బహుజన రాజ్యాన్ని స్థాపించిన మాన్యశ్రీ కాన్షీరామ్ 92వ జయంతి ఆడేపు సురేందర్ అధ్యక్షతన సిరసపల్లి క్రాస్ రోడ్ వద్ద ఘనంగా జరిగింది. ముందుగా కాన్షీరామ్ చిత్రపటానికి నాయకులందరూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని మాట్లాడుతూ అంబేద్కర్ కలలు కన్న బహుజన రాజ్యాధికారాన్ని ఆచరణలో అమలు చేసి నిరూపించిన నిజమైన అంబేద్కర్ వారసుడు కాన్షీరామ్ అని ఆయన సేవలను కొనియాడారు. కాన్షీరామ్ చతురతను, రాజనీతిజ్ఞతను అంకితభావాన్ని స్ఫూర్తిగా తీసుకొని బీసీ ఎస్సీ ఎస్టి మరియు మైనారిటీ వర్గాలు రాజ్యాధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు ఇల్లందుల సమ్మయ్య, బొరగాల మొగిలి, కాలిక్ హుస్సేన్ మరియు ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు రుద్రారపు రామచంద్రం, ఆకినపల్లి శిరీష ప్రవీణ్, డాక్టర్ తడికమళ్ళ శేఖర్, వేల్పుల రత్నం, కనకం వెంకటస్వామి, రాo రాజేశ్వర్, మేకల రవీందర్, ఎర్ర శ్రీధర్, మట్టేడ ప్రకాష్, సందేల వెంకన్న, మేకల మల్లేష్, కండె తిరుపతి , మిడిదొడ్డి సంపత్, ఎర్ర రాజు, గడిపే సహోదర్, బొడిగె మల్లయ్య, అంబాల రవీందర్ , మొలుగూరి కొమరయ్య, రుద్రారపు కుమార్ తదితరులు పాల్గొన్నారు

కాన్షి రామ్ చిత్ర పటం వద్ద నివాళులర్పిస్తున్న చైర్ పర్సన్ సుహాసిని, వివిధ సంఘాల నాయకులు





