
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఉన్న వాకర్స్ సమస్యలను పరిష్కరిస్తానని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని అన్నారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఆమె వాకర్స్ తో కలిసి మైదానంలో పర్యటించారు. ఈ సందర్భంగా వాకర్స్ సమస్యల గురించి అందరిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… శారీరక ఆరోగ్యం కోసం ప్రతిరోజు వందలాది మంది వాకర్స్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానముకు వస్తున్నారని, వారికి ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. వాకర్స్ కోసం టాయిలెట్లు త్వరలో నిర్మించడం జరుగుతుందని, వాకింగ్ ట్రాక్ పూర్తి అయ్యేలా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తాళ్లపెళ్లి రమేష్, ఇల్లందుల సమ్మయ్య, బొరగాల మొగిలి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొమురవెల్లి హరిప్రసాద్, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు ముషం రాజేందర్, కందాల రమేష్, నాయకులు కోయల్కార్ బాలాజీ, ఉప్పు శ్రీనివాస్ పటేల్, పున్నం చందర్, భీమగోని సురేష్, కేశిరెడ్డి నరసింహారెడ్డి, మాజీ అధ్యక్షులు గోవర్ధన్, పాక సతీష్, బత్తుల రాజలింగం, వేల్పుల రత్నం, పొడిశెట్టి వెంకటరాజo తదితరులు పాల్గొన్నారు.









