
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ బిజెపి పట్టణ అధ్యక్షుడు తుర్పాటి రాజు ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు విమర్శిస్తూ నిరసన తెలిపి హుజురాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ లో వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది, కానీ వాటిలో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు పూర్తిగా అమలు కాలేదు అన్నారు. నమ్మకం పెట్టుకొని ఓటు వేసిన ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య, వితంతు మరియు దివ్యాంగులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతులకు రైతు భరోసా, భూ సమస్యల పరిష్కారం వంటి అనేక హామీలు ఇప్పటికీ అమలు కావడం లేదన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా సమయానికి అందకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. దరఖాస్తులు చేసుకున్న అనేక మంది వృద్ధులు, వికలాంగులు మరియు ఒంటరి మహిళలకు ఇప్పటికీ పెన్షన్లు మంజూరు కాలేదన్నారు. అర్హులైన దరఖాస్తులను వెంటనే ఆమోదించి వారికి పెన్షన్లు అందించాలని కోరారు. పేదలకు ప్రభుత్వం ప్రకటించిన గృహ నిర్మాణ పథకం కింద అర్హులైన లబ్దిదారులకు వెంటనే ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు మరియు వీధి దీపాలు వంటి ప్రాథమిక సదుపాయాలు సరైన విధంగా అందడం లేదు అన్నారు. ఈ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే స్థానికంగా హుజురాబాద్ లో డంపు యార్డు ఏర్పాటును ఇక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. తక్షణమే డంప్ యార్డ్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కోరారు. రెండో విడత దళిత బందును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, మాజీ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, కౌన్సిలర్లు కొలుగురి సుమలత, లక్ష్మీదుర్గ, అనురాగ్, బిజెపి సీనియర్ నాయకులు నరాల రాజశేఖర్, కొలిపాక శ్రీనివాస్, తిప్పబతిని రాజు, యాంసాని శశిధర్, రోహిత్, గొట్టే రవి, బోరగాల సారయ్య, కొలిపాక వెంకటేష్, ఎర్ర శ్రీధర్, మోటపోతుల రాకేష్, క్యాస వెంకటేష్, గరిగే శివ, అయిత సందీప్, రాపాక రాజు, నల్ల అజయ్, కృష్ణ, తూర్పాటి రాజశకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న బిజెపి నాయకులు, కార్యకర్తలు..

తాసిల్దార్ కార్యాలయ ఉద్యోగులకు వినతి పత్రం అందజేస్తున్న బిజెపి నాయకులు, కౌన్సిలర్లు…





