
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని అన్నారు. మంగళవారం ఆమె 15వ వార్డులో కౌన్సిలర్ వెంకటనాయక్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పలు వీధులను తిరిగి ప్రత్యక్షంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఉప్పు శ్రీనివాస పటేల్ మాట్లాడుతూ… గత కొంతకాలంగా వార్డులో వీధిలైట్ల సమస్య ఉందని, పలు ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య ఉందని ఇంతేకాక పలు వీధుల్లో సిసి రోడ్ల నిర్మాణం ఇంకా పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. దీనికి స్పందించిన మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని మాట్లాడుతూ… వార్డు సమస్యలను ప్రాధాన్యత క్రమంగా వాటిని పరిష్కరిస్తానని చెప్పారు. ప్రజల సహకారంతో అభివృద్ధితో పాటు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక పథకాలను అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు గొట్టే జమదగ్ని, గోపి, కిరణ్ గౌడ్, సాయి గౌడ్, వకుల, సానిటరీ జవాన్ టీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కొత్తపల్లి ఇంద్రనగర్ గ్రామ ప్రజల కోసం నిర్మించుకున్న పోచమ్మ దేవాలయంను పరిశీలిస్తున్న చైర్పర్సన్ సుహాసిని..




15 వార్డు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న చైర్పర్సన్ సుహాసిని..


చైర్ పర్సన్ సుహాసిని నీ సత్కరిస్తున్న 15వ వార్డు ప్రజలు..





