
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి వరంగల్: అన్న ధాతలను ఆదుకోవడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం వీడాలని, న భూతో న భవిష్యత్ తరహాలో
ఏప్రిల్ 28న కరీంనగర్ లో లక్షమందితో రైతుల మహాగర్జన సమరభేరి విజయవంతం కావాలని వరంగల్లోని వేయి స్థంభాల గుడిలో ఓసి ఐకాస, రైతు ప్రజాసంఘాల సమాఖ్య రాష్ట్ర, ఉమ్మడి జిల్లాల నాయకుల ఆధ్వర్యంలో రుద్రాభిషేకం చేసినట్లు
రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు.
పాలకులు రైతు ప్రభుత్వాలు అని గొప్పలు చెప్పుకోవడం తప్ప వారిని ఆదుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆరోపించారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడ మేమిటని ప్రశ్నించారు. ముఖ్యంగా రైతులకు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదల లో ఎందుకు జాప్యం చేస్తోంది అని నిలదీశారు. సాగు సమయంలోనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు.

వేయి స్తంభాల గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

రైతులు పండించిన పంటలకు క్వింటాల్ కు 3 వేల రూపాయలు చొప్పున చెల్లింపులు చేయాలనీ సన్న దొడ్డు వడ్లకు ఇచ్చిన హామీ మేరకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ పంటల కొనుగోళ్ల సమయంలోనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఇతర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 28న ఓసి ఐకాస, రైతు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ లో లక్ష మందితో ఓసి ఐకాస ఉత్తర తెలంగాణ జిల్లాల ఓసి జేఏసీ చైర్మన్ పెండ్యాల రాంరెడ్డి అధ్యక్షతన రైతు మహాగర్జన సమర భేరి సభ నిర్వహించనున్నట్లు పోలాడి ప్రకటించారు. ఉగాది పర్వదిన సందర్భంగా గురువారం వరంగల్ వేయి స్థంభాల గుడిలో ఏప్రిల్ 28 న ఓసి జేఏసీ, రైతు ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంల అన్నదాతలకు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ లక్ష మంది తో కరీంనగర్ లో నిర్వహించ తలపెట్టిన రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన విజయవంతం చేయాలని కోరుతూ ఐకాస రాష్ట్ర, వివిధ జిల్లాల ముఖ్య నేతలతో కలిసి ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రుద్రాభిషేకం నిర్వహించి రుద్రేశ్వరుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదానం నిర్వహించారు. వివరాలను రామారావు మీడియాకు వివరాలు వెల్లడించారు.


వరంగల్ ఎంఎల్ఏ నాయిని రాజేందర్ రెడ్డి పూజా కార్యక్రమాలో పాల్గొని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. రామారావు మాట్లాడుతూ రైతుల పంటలపై
ప్రస్తుతం అమలు జరుగుతున్న గిట్టుబాటు ధరలు అన్న దాతలకు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేనే లేవని రైతులు పండించిన పంటలకు రైతులే గిట్టుబాటు ధరలను నిర్ణయించుకునే అవకాశం కల్పించే విధంగా జాతీయస్థాయిలో ప్రత్యేక చట్టం తీసుకు రావాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రస్తుత పరిస్థితుల్లో కూలీల కొరత పెరుగుతోందని, ఖర్చులు బాగా పెరిగి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైతుల వ్యవసాయరంగానికి చేయూత నిచేందుకు, గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వ్యవసాయ రంగాన్ని బలోపితం చెయ్యాలంటే జాతీయ ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ రంగాన్ని తక్షణమే అనుసంధానం చేయాలన్నారు.
రైతు భీమా వయోపరిమితిని 70ఏళ్లకు పెంచాలని, 50ఏళ్లు నిండిన రైతులకు నెలకు కనీసం 6వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని, రైతుల అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు 20లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని, వివిధ ఓసి కార్పొరేషన్ల నామ మాత్రంగానే ప్రకటించిన పాలకులు నిధులు, పాలకమండల్లను నేటికీ ఏర్పాటు చేయలేదని తక్షణమే ఆయా కార్పొరేషన్ లకు నిధులు విడుదల చేసి పాలకమండల్లులను ఏర్పాటు చేయాలని,
ఆర్ధికంగా వెనుకబడిన ఆగ్రకుల పేదల సంక్షేమం కోసం జాతీయ స్థాయి ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలనే తదితర డిమాండ్ల పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 28న కరీంనగర్ లో నిర్వహించే రైతు మహాగర్జన సమరభేరి సభ ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకు వస్తామని ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు.
పార్టీల కతీతంగా అందరినీ సభకు ఆహ్వానిస్తామని అన్ని జిల్లాలనుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు భారే సంఖ్యలో తరలి వచ్చేలా ఏర్పాట్లు శరవేగంగా జరుపుతున్నామని , వివిధ జిల్లాల ఓసి ఐకాస, రైతు ప్రజాసంఘాల నాయకుల తో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశామని ఒక ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచే 30 వేల మంది మహిళలను సమీకరుస్తున్నామని పోలాడి రామారావు వెల్లడించారు. ఓసి జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్రవైశ్య సంఘాల జేఏసీ చైర్మన్ అయిత నాగరాజు, రైతు ప్రజాసంఘాల రాష్ట్ర జేఏసీ రాష్ర కన్వీనర్ కూరతోట సురేందర్ రెడ్డి, ప్రథాన కార్యదర్శి చందుపట్ల నరసింహరెడ్డిలతో పాటు వివిధ జిల్లాల ఐకాస, ప్రజా సంఘాల నాయకులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

వరంగల్ ఎంఎల్ఏ నాయిని రాజేందర్ రెడ్డి పూజా కార్యక్రమాలో పాల్గొని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు, రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.





