
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని ఉపవాస దీక్ష ద్వారా మానసిక, శారీరక పవిత్రత లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం సాయంత్రం రంజాన్ పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి ఇమ్రాన్ ఆధ్వర్యంలో పార్టీ నాయకుడు ప్రణవ్ ను కలిశారు. ఈ సందర్భంగా ప్రణవ్ ముస్లిం ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓర్పు, సహనం, సత్ప్రవర్తనతో మెలగాలన్నది రంజాన్ ఉపవాస దీక్షల ప్రధాన సందేశమన్నారు. మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. ఇమ్రాన్ ప్రణవ్ కు స్వీట్ తినిపించి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలుపగా ఆయన కూడా వివరాలు కప్పి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బోరగాల మొగిలి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నేరెళ్ల మహేందర్ గౌడ్, కాజీపేట శ్రీనివాస్, సాంబరావు, యూత్ కాంగ్రెస్ నాయకులు రేవంత్ తదితరులు పాల్గొన్నారు.


కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ కు స్వీట్ తినిపించి శాలువా కప్పి సత్కరిస్తున్న ఇమ్రాన్






