
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని పలు హోటల్లు, టిఫిన్ సెంటర్లపై సివిల్ సప్లై అధికారులు సోమవారం దాడులు నిర్వహించి వాటిల్లో అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న 22 డొమెస్టిక్ సిలిండర్లను పట్టుకొని సీజ్ చేశారు. ఈ సందర్భంగా పలు హోటల్లలో, టిఫిన్ సెంటర్లలో పలువురు నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య సిలిండర్లకు బదులుగా డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ లను వాడుతున్నట్లు కనపడడంతో 22 సిలిండర్ లను సీజ్ చేశారు. వాణిజ్య కేంద్రాలలో డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ను వాడుతున్నందున వాటిని సీజ్ చేసి ఎల్పిజి గోడౌన్ వారికి సేఫ్ కస్టడీ నిమిత్తం అప్పగించి వాడకము దారుల ఫైన 6A కేసులు నమోదు చేసినట్లు వారు తెలిపారు. వాణిజ్య కేంద్రాలు ఎవరు కూడా డొమెస్టిక్ సిలిండర్లు వాడొద్దని వారు కమర్షియల్ గ్యాస్ మాత్రమే వాడాలని వారు సూచించారు. ఈ దాడులలో కరీంనగర్, గంగాధర, సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్లు సురేందర్, ఉష, హుజురాబాద్, కరీంనగర్, తిమ్మాపూర్ సివిల్ సప్లై ఇన్స్పెక్టర్లు ఇల్లందుల వినోద్ కుమార్, శ్రీనివాసరెడ్డి, అన్వర్, ఉద్యోగి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

దాడులు చేసి పట్టుకున్న సిలిండర్లతో సివిల్ సప్లై అధికారులు…

పట్టుకున్న సిలిండర్లను గ్యాస్ కంపెనీకి అప్పగించిన అధికారులు..





