
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భవిష్యత్తును అంధకారం చేసే మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని హెడ్ కానిస్టేబుల్ శంకర్ అన్నారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని న్యూ శాతవాహన హైస్కూల్లో విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మత్తు పదార్థాలను అలవాటు చేసుకోకూడదని వాటివల్ల అనేక దుష్పరిణామాలు ఉన్నాయని అన్నారు. సమాజానికి నష్టం కలిగించే విద్యార్థుల ఆరోగ్యానికి హాని చేసే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాల ఉపయోగము వల్ల కలిగే నష్టాలు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని అపరిచిత వ్యక్తుల నుండి ఎలాంటి వస్తువులను తీసుకోకూడదని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యూ శాతవాహన హైస్కూల్ కరస్పాండెంట్ వకులాభరణం వెంకటేశ్వర్లు, ఆదర్శ కరస్పాండెంట్ పరాంకుశం కిరణ్ కుమార్, కార్యక్రమం ఆర్గనైజర్ సమ్మయ్య, ఉపాధ్యాయులు రాజయ్య, నాజియా, రిజ్వానా, శిరీష, రమేష్, షాహిన్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న హెడ్ కానిస్టేబుల్ శంకర్





