
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త పెన్షనర్ల వాలిడేషన్ చట్టానికి వ్యతిరేకంగా నల్ల రిబ్బన్లు ధరించి బుధవారం హుజూరాబాద్ పట్టణంలో తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి తహసిల్దార్ నరేందర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….
ఉద్యోగుల, పెన్షనర్ల ప్రయోజనాలను కాపాడే చట్టాలను చేయాల్సిన ప్రభుత్వాలే వారి ప్రయోజనాలకు భంగం కలిగించే వాలిడేషన్స్ చట్టం తీసుకురావడం దారుణం అన్నారు. వ్యాలిడేషన్ బిల్లు చట్టంగా మారడం లక్షలాదిమంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు పెనుభూతం లా మారిందని అన్నారు. పెన్షనర్ల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు లాంటి చట్టాన్ని తీసుకురావడం ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేశారు .ఈ చట్టం ద్వారా పెన్షనర్లను రెండు వర్గాలుగా విభజించడం శోచనీయమని వారన్నారు. 2026 జనవరి 1వ తేదీ కంటే ముందు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఎలాంటి వేతనము పెంపు లేకపోవడం కరువు భత్యాన్ని నిలిపివేయడం దారుణమని మండిపడ్డారు. కేవలం వారు రిటైర్ అయిన రోజు ఉన్న పెన్షన్ మాత్రమే చెల్లించే విధంగా నిబంధనలు రూపొందించటం పెన్షనర్ల అస్తిత్వానికి ముప్పు వాటిల్లుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వైద్య లక్ష్మయ్య, కార్యదర్శి గంజి జయవర్ధన్, కోశాధికారి దుర్గాజి, కన్నం ప్రభాకర్, గాజుల చారుదత్తు, గుంటి రాజయ్య, జున్నుతుల రాo రెడ్డి, మాడిశెట్టి నరసయ్య, పిల్లల లక్ష్మీనారాయణ, గణపతిరెడ్డి, కాసర్ల శ్రీహరి, ఇలాసాగరం వీరస్వామి, విష్ణుదాసు గోపాలరావు, వేల్పుల రత్నం, కొన్ని రాజిరెడ్డి, సొల్లు సారయ్య, తిరుపతిరెడ్డి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

పెన్షనర్ల వాలిడేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహిస్తున్న పెన్షనర్లు


తహసిల్దార్ నరేందర్ కు వినతిపత్రం ఇస్తున్న పెన్షనర్లు





