
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని సిర్సపల్లి గ్రామ సరిహద్దు ప్రాంతంలో ప్రజాభి ప్రాయ సేకరణ చేయకుండా జనావాసాల మధ్య నెలకొల్పే డంపింగ్ యార్డ్ ను వెంటనే రద్దు చేయాలని రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. శనివారం డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని నిరసన తెలుపుతున్న మహిళలకు సంఘీభావం తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ… గుట్టు చప్పుడు కాకుండా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలనే పాలకుల వైఖరి పై గత వారం రోజులుగా ప్రజలు నిరసనలు తెలుపుతున్న ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమని అన్నారు. ఈ ప్రాజెక్టు వలన వాతావరణంలో ఎన్నటికీ నశించని విషపదార్థాలు వెలువడి పాడి పంటల దిగుబడి తగ్గి అన్నదాతలకు తీవ్ర నష్టం జరుగుతుందని, ప్రజలకు పశువులకు క్యాన్సర్ సో అన్నారు. డంపింగ్ యార్డ్ వల్ల హుజురాబాద్ ప్రాంతమే కాకుండా సమీప 4 జిల్లాల వరకు దీని ప్రభావం ఉంటుందని తెలిపారు.
అధికారులు పాలకులు మభ్య పెట్టే ప్రయత్నాలు మానుకొని ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా చేపట్టే ఇట్టి డంపింగ్ యార్డు పనులను తక్షణమే నిలిపివేసి జనావాసాలకు దూరంగా తరలించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు మిత్ర ప్రజా సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి, రాష్ట్ర ప్రథాన కార్యదర్శి చందుపట్ల నరసింహరెడ్డి, రాష్ట్ర నాయకులు ఎడవెల్లి కొండాల్ రెడ్డి, దండ వెంకట రమణారెడ్డి, సమ్మయ్య,శంకర్, చైతన్యరెడ్డి, తులసీ లక్ష్మణమూర్తి పాల్గొన్నారు.


డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని నిరసన తెలుపుతున్న మహిళలకు సంఘీభావం తెలిపి మాట్లాడుతున్న రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..






