
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ ప్రజలకు అనుకూలంగా ఉండే పాత మార్కెట్ ప్రాంతంలో తిరిగి మార్కెట్ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం పలువురు కౌన్సిలర్లు చైర్ పర్సన్ సుహాసినికి, వైస్ చైర్పర్సన్ గూడూరి అంజలికి వినతి పత్రం అందజేశారు. సోమవారం జరిగిన బడ్జెట్ సమావేశంలో వార్డు కౌన్సిలర్ కోయల్ కార్ భారతి మిగతా కౌన్సిలర్ల సంతకాలతో చైర్పర్సన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ భారతి బాలాజీ మాట్లాడుతూ… పాత మార్కెట్ స్థానంలో మార్కెట్ నడవకపోవడం వల్ల ఈ ప్రాంత వ్యాపారస్తులు ప్రజలు తీవ్రముగా నష్టపోయారని, ప్రజలు సైతం కూరగాయలు కోరుకోవడానికి చాలా దూరం వెళ్లాల్సి వస్తుందని, రోడ్డుపై దుకాణాలు పెట్టడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజల సౌకర్యార్థం పాత మార్కెట్ తిరిగి పాత మార్కెట్ ప్రాంతంలోనే మార్కెట్ కొనసాగేలా చేయాలని కోరారు.

చైర్మన్, వైస్ చైర్మన్ లకు వినతిపత్రం అందజేస్తున్న కౌన్సిలర్ భారతీ ఆధ్వర్యంలోని కౌన్సిలర్ల బృందం..





