
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి వరంగల్: అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న రెండు లక్షల మందితో కరీంనగర్ లో రైతు ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభ విజయవంతం కావాలని వేయి స్థంభాల గుడిలో రుద్రేశ్వర స్వామి దేవాలయంలో గురువారం రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు నాయకులతో కలిసి వేద పండితుడు గంగు ఉపేంద్రశర్మ పూజ కార్యక్రమాలతో రుద్రాభిషేకం నిర్వహించారు.



వేయి స్తంభాల గుడిలో శివుడికి రుద్రాభిషేకం చేస్తున్న పోలాడి రామారావు..
చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుని కి వేద పండితుల మంత్రోపదేశాలతో పోలాడి రామారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ అన్న దాతలకు ఇచ్చిన హామీలను ముఖ్యంగా కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని. రెండు లక్షల రుణమాఫీ లోకేవలం 30 శాతం రైతులకు మాత్రమే మాఫీ కాగా మిగిలిన 70 శాతం మంది రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని, సాగు సమయంలోనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇచ్చిన హామీల మేరకు కేవలం సన్న రకాలకే కాకుండా అన్ని రకాల పంటలకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ను ధాన్యపు కొనుగోళ్ల సమయం లోనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల ఏప్రిల్ 28న కరీంనగర్ జిల్లా కేంద్రంలో రెండు లక్షల మందితో రాష్ట్ర వ్యాప్త రైతుల మహాగర్జన సమరభేరి సభను రాజకీయాల కతీతంగా నిర్వహిస్తున్నట్లు రామారావు తెలిపారు. ఈ సభ విజయవంతం కావాలని రైతు ప్రజాసంఘాల నాయకుల జేఏసీ నాయకులతో కలిసి వేయి స్థంభాల గుడిలో రుద్రాభషేకం, చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతునికి ఓసి జేఏసీ జాతీయ గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రైతు ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి, ప్రథాన కార్యదర్శి చందుపట్ల నరసింహరెడ్డి, అంచూరి సదానందం బోయినపల్లి శ్రీనివాస్ రావు తదితరులు ఉన్నారు.


వేయి స్తంభాల గుడిలో ప్రత్యేక పూజలు చేస్తున్న పోలాడి రామారావు, ఓసి జెసి నాయకులు..





