
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ శివారులోని గణేష్ నగర్ – సిరసపల్లి మధ్య ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డును రద్దు చేయాలని కోరుతూ గురువారం కళాకారులు ఆట…పాట నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు తమ తమ పాటలతో ప్రజలను చైతన్యవంతులు చేశారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల జరిగే నష్టాలను తమ పాటల రూపంలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించారు. కళాకారుల ఆటపాట నడుస్తున్నంత సేపు ప్రజలు ఆసక్తిగా విన్నారు.
–ఉద్యమానికి కళాకారులు కీలకం
డంపింగ్ యార్డ్ రద్దు కోసం జరుగుతున్న కార్యక్రమంలో కళాకారుల పాత్ర కీలకమని వారు తమ ఆటపాటలతో విషయాన్ని ప్రజల మనసుల్లోకి తీసుకెళ్లారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఉద్యమం కోసం వారు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు విష్ణుదాసు గోపాలరావు, కొలుగూరి దేవయ్య, పంజాల రామనారాయణగౌడ్, వడ్లకొండ అనిల్, తిరుపతి, బుర్ర నటరాజ్, డప్పు కుమార్, మురళీ మధు, రామంచ భరత్, అవునూరు సుధాకర్, అవునూరి కోమల, ఏం సంపత్, నవీన్, ఆర్ తిరుపతి, అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు.







