
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు, డిమాండ్ల సాధనకు ఈనెల 28న కరీంనగర్ లో 2 లక్షల మందితో ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభను నిర్వహిస్తున్నట్లు రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు.
ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల రైతు ప్రజాసంఘాల నాయకులతో కలిసి శుక్రవారం రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హైదరాబాద్ లో మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, వీ.శ్రీనివాస్ గౌడ్, సుద్దాల దేవయ్య, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ హోదాల్లో ఉన్న తాజా మాజీ ప్రజాప్రతినిధులను కరీంనగర్ లో ఈనెల 28న అన్నదాతలకు వివిధ సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి రైతుల మహా గర్జన సమర భేరి సభకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను అందజేసి వారిచే రైతుల మహాగర్జన సభ గోడ ప్రతులను రామారావు ఆవిష్కరింప జేశారు.



రాష్ట్రస్థాయి రైతుల మహా గర్జన సమర భేరి సభ గోడ ప్రతులను ఆవిష్కరిస్తున్న మాజీ మంత్రులు..
సభకు తాము సంపూర్ణ సహకారం అందిస్తామని తాము స్వయంగా సభకు హాజరవుతామని ప్రకటించిన మాజీ మంత్రులకు వివిధ జిల్లాల నాయకులకు రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పాలకులు రైతు ప్రభుత్వాలని చెప్పుకోవడం తప్ప వారిని ఆడుకోవడం లో తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ రైతాంగానికి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతుందటం వాంఛనీయం కాదన్నారు. ముఖ్యంగా కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని. రెండు లక్షల ఋణ మాఫీ లో కేవలం 30 శాతం మందికి మాత్రమే మాఫీ కాగా మిగతా 70 శాతం మంది రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని సాగు సమయంలోనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పాల ఉత్పత్తి దారులకు గతంలో లీటరుకు 4 రూపాయల రాయితీ ఇవ్వగా నేటి ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇచ్చిన హామీల మేరకు కేవలం సన్న రకాలకే కాకుండా అన్ని రకాల పంటలకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ను ధాన్యపు కొనుగోళ్ల సమయంలోనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మొత్తం 12 డిమాండ్లతో ప్రభుత్వాలను కళ్ళు తెరిలించేలా కరీంనగర్ లో లక్షలాది మందితో రాజకీయాల కతీతంగా సమరభేరి నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు ప్రజాసంఘాల అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి, వివిధ జిల్లాల ప్రజా సంఘాల నాయకులు నదిపెల్లి వెంకటేశ్వర్ రావు, హంస కేతన్ రెడ్డి, చకిలం రమణయ్య, వన్నాల విష్ణు వర్ధన్ రెడ్డి, నరేష్ యాదవ్, మందగల్ల నగేష్, కవ్వంపల్లి అనిల్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రులతో గోడపత్రులు ఆవిష్కరింపజేస్తున్న జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..





