
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ యోధుడు ఈటల రాజేందర్ ను ఈనెల 28 న కరీంనగర్ జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి రైతుల మహా గర్జన సమర భేరి సభకు హాజరు కావాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు నాయకులతో శామీర్ పేటలోని వారీ నివాసంలో శుక్రవారం రాత్రి ఈటలను కలిసి సమరభేరి గర్జన సభకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రంను అందజేసి, ఈటల రాజేందర్ తో మహగర్జన పోస్టర్ ను పోలాడి రామారావు ఆవిష్కరింపజేశారు. ఈ సమావేశానికి సంపూర్ణ సహకారం అందిస్తానని తాను స్వయంగా సభకు హాజరవుతామని ఈటల రాజేందర్ ప్రకటించగా ఆయనకు రైతు ప్రజాసంఘాల సమాఖ్య తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పోలాడి రామారావు ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు. డిమాండ్ల సాధనకు ఈనెల 28 న కరీంనగర్ లో 2 లక్షల మందితో ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభను నిర్వహిస్తున్నట్లు రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు.


ఈటలకు శాలువా కప్పి, ఆహ్వాన పత్రం అందజేసి గోడప్రతిని ఆవిష్కరింపజేస్తున్న జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పాలకులు రైతు ప్రభుత్వాలని చెప్పుకోవడం తప్ప వారిని ఆడుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ రైతాంగానికి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతుందటం వాంఛనీయం కాదన్నారు. ముఖ్యంగా కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని. రెండు లక్షల ఋణ మాఫీ లో కేవలం 30 శాతం మందికి మాత్రమే మాఫీ కాగా మిగతా 70 శాతం మంది రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని సాగు సమయంలోనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పాల ఉత్పత్తి దారులకు గతంలో లీటరుకు 4 రూపాయల రాయితీ ఇవ్వగా నేటి ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆరోపించారు ఇచ్చిన హామీల మేరకు కేవలం సన్న రకాలకే కాకుండా అన్ని రకాల పంటలకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ను ధాన్యపు కొనుగోళ్ల సమయం లోనే చెల్లించాలని డిమాండ్ చేశారు మొత్తం 12 డిమాండ్లతో ప్రభుత్వాలను కళ్ళు తెరిలించేలా కరీంనగర్ లో లక్షలాది మంది తో రాజకీయాల కతీతంగా సమరభేరి నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.






