
–హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విడనాడాలి.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అన్నదాతలకు విద్యార్థులకు వివిధ కుల సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్య ధోరణి విడనాడాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని. డిమాండ్ల సాధనకు కరీంనగర్ లో ఈనెల 28న లక్షలాది మందితో నిర్వహించే రాష్ట్రస్థాయి రైతుల మహా గర్జన సమర భేరి సభకు హాజరు కావాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆహ్వాన పత్రం అందజేశారు.


డంపింగ్ యార్డు పరిశీలనకు హుజురాబాద్ కు వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ నీ ప్రజా సంఘాల నాయకుల తో కలిసి పోలాడి రామారావు రైతుల మహాగర్జన సమర భేరి సభ ఆహ్వాన పత్రికలను అందజేయగా స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో నిర్వహించే రైతుల సభకు మద్దతు సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. అందుకు ప్రజా సంఘాల సమాఖ్య తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ కి పోలాడి రామారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులతో కలిసి జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొనే సిఎం రేవంత్ సర్కార్ అన్నదాతల సంక్షేమం పై నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో నిధుల కేటాయింపులు తగ్గించిన ప్రభుత్వం రాష్ట్రంలో 70శాతం మిగిలి ఉన్న రెండు లక్షల రుణమాఫీకి నిధులు కేటాయించలేదని కౌలు రైతులకు ఇచ్చిన హామీల ఊసే లేదని, అన్ని రకాల పంటలకు 500 రూ. బోనస్ ఇవ్వకుండా కేవలం సన్న రకాలకు అడపా దడపా అర కొరగా ఇస్తూ మోసాగించిందన్నారు.
ఇప్పటికే రెండు సార్లు రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిన నామ మాత్రంగానే విడుదల చేసి రైతులను దేహీ అనే విధంగా హీనంగా పరిగణించే సర్కారుకు రైతన్నల ఉసురు తగలక తప్పదని హెచ్చరించారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల విడుదల చేయడం లేదని అన్నారు. నామ మాత్రంగానే ఓసి రెడ్డి కార్పొరేషన్ లను ప్రకటించిన ప్రభుత్వం పాలక మండళ్లు ఏర్పాటు చేయలేదని బడ్జెట్ లో నిధులు కేటాయించక రెడ్డి ఓసి లను మోసగించిందన్నారు.
నామ మాత్రంగానే ఏర్పాటు చేసిన రెడ్డి కార్పొరేషన్ కు తక్షణమే చట్ట బద్దత కల్పించి పాలక మండలి ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని,
50 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని,
పాల ఉత్పత్తి దారులకు గతంలో ఉన్నట్లుగా లీటరు 4 రూపాయల రాయితీ ఇవ్వాలని, వ్యవసాయ రంగానికి పరిశ్రమగా గుర్తించి రాయతీలు ప్రకటించాలని,
రైతులకు న్యాయమైన గిట్టుబాటు ధరలు నిర్ణయించి ప్రభుత్వమే నేరుగా కొనుగోళ్లు చేయాలని,
రైతు భీమా వయోపరిమితిని 59 ఏళ్లనుంచి 70 ఏళ్లకు పెంచాలని, రైతులకు అన్ని విభాగాల్లో 20 లక్షల రూ. ఉచిత వైద్య సౌకర్యం ఏర్పాటుకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, గ్రామీణ ప్రాంతాలలో ప్రస్తుత పరిస్థితుల్లో కూలీల కొరత పెరగడంతో పాటు ఖర్చులు బాగా పెరిగిన నేపథ్యంలో రైతుల వ్యవసాయ రంగానికి చేయూత నిచ్చేందుకు గ్రామీణ ప్రాంతాలలో ఉపాది అవకాశాలు పెరగడంతో పాటు వ్యవసాయ రంగాన్ని బలోపితం చేయాలంటే జాతీయ ఉపాధి హామీ పథకం లో వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేయాలని..
రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర నిర్ణయించుకునే రైతుల భాగస్వామ్యం ఉండే ప్రత్యేక రైతు చట్టం తేవాలని డిమాండ్ చేశారు.
రైతులను నిలువు దోపిడీకి గురి చేస్తున్న ప్రైవేట్ రంగంలోని సీడ్ కంపెనీల ఆగడాలను అరి కట్టాలని,
ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన అన్ని రకాల పంటలకు నిబంధనలతో సంబంధం లేకుండా మద్దతు ధర తో ప్రభుత్వమే నేరుగా కొనుగోళ్లు చేయాలని,
ఆయకట్టు చివరి వరకు నీళ్ళు అందించే విధంగా వాటర్ మేనేజ్ మెంట్ చేయాలని, ఇచ్చిన హామీల మేరకు జాబ్ కేలండర్ ప్రకటించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని, ఆర్ధికంగా వెనుకబడిన ఓసిల సంక్షేమం కోసం ఇతర సామాజిక వర్గాలకు ఉన్నట్లుగా జాతీయ రాష్ట్ర స్థాయిలో ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలనే తదితర డిమాండ్ల సాధనకు అన్ని సామాజిక వర్గీయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఏప్రిల్ 28న ఓసి ఐకాస ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పార్టీల కతీతంగా న భూతో న భవిష్యత్ తరహాలో ఈ రాజకీయ పార్టీ నిర్వహించని రీతిలో లక్షలాది మందితో నిర్వహించే రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమర భేరి సభకు రాజకీయాల కతీతంగా అన్నీ వర్గాల ప్రజలను తాజా మాజీ ప్రజా ప్రతినిధులను వివిధ పార్టీల నాయకుల ను ఆహ్వానిస్తున్నామని ఇందులొ భాగంగా మాజీ మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, ఇనుగాల పెద్దిరెడ్డి, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, సుద్దాల దేవయ్య, రావుల చంద్రశేఖరరెడ్డి, ఇంద్ర కరణ్ రెడ్డి, .జీవన్ రెడ్డి లతో పాటు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, సీపీఐ అగ్రనేత చాడవెంకట్ రెడ్డి, ఎంఎల్ ఏ నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, సతీశ్ బాబు, మనోహర్ రెడ్డి తదితరులను ఇప్పట్టి వరకు స్వయంగా కలిసి ఆహ్వానించగా వారు సానుకూలంగా స్పందించి అన్నీ విధాలుగా సహకారం అందించడం మరువలేనిదని రామారావు ఆనందం వ్యక్తం చేశారు. శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని,1000ట్రాక్టర్లు, రెండు వేల బస్సులో ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వివిధ జిల్లాలకు కో ఆర్డినేటలను నియమించి బాధ్యతలు ప్రచార సామగ్రి అందజేయడం జరిగిందన్నారు.
ముప్పది వేల మంది మహిళలతో పాటు 10 వేల మంది యువత, రెండు వేల మంది డప్పు కళాకారులతో సహా ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే 50 వేల మందితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా మొత్తంగా 2 లక్షల మందికి పైగా హాజరయ్యే చరిత్ర సృష్టించే సమరభేరి సభ ద్వారా ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించే విధంగా విజయవంతం చేయాలని పోలాడి రామారావు కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎడవెల్లి కొండాల్ రెడ్డి. శ్రీనివాస్.పోల్సాని రామారావు ఉమ్మడి జిల్లా నాయకులు యాదగిరి, కృష్ణారెడ్డి, గౌతంరెడ్డి, వెంకట్ రెడ్డి, సంపత్ రావు, సమ్మిరెడ్డి, రాజన్న తదితరులు పాల్గొన్నారు.






