
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజల ఆరోగ్యానికి నష్టం కలిగించే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడితే ఖబర్దార్ అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డంపింగ్ యార్డ్ రద్దు కోసం 13 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ..
హుజురాబాద్ లో డంప్ యార్డ్ పెట్టి ఈ ప్రాంతాన్ని విషతుల్యం చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనకు వ్యతిరేకంగా హుజురాబాద్ దాని పక్కన ఉన్న గ్రామాలు ప్రజలు జేఏసీగా ఏర్పడి మీరు చేస్తున్న ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు అని అన్నారు.నాకు యాక్షన్ రాదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడమే వస్తుంది. దీక్ష చేస్తున్నారని తెలియగానే నేను తప్పకుండా వస్తా అని వచ్చాను. నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు. ఏ ప్రభుత్వం ఇచ్చింది… ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అనే రాజకీయాలు మాట్లాడానికి రాలేదు అని అన్నారు. కొంతమంది లాగా విమర్శించడానికి, సోషల్ మీడియాలో పెట్టుకొని గ్లామర్ పెంచుకోవడం చేయను నేను అని అన్నారు. దేశంలో అతి దుర్మార్గపు ఘటన.. లక్షల ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ.. 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలకు అనేక రకాల రోగాలకు కారణమవుతున్న జవహార్ నగర్, బాలాజీ నగర్ డంప్ యార్డ్ కు సజీవ సాక్ష్యం నేనే అని,
దానికి వ్యతిరేకంగా ఎంపీ అయిన తర్వాత అనేకసార్లు ఉద్యమాలు చేశాననీ అన్నారు . మీలాగా అక్కడ వారు జేఏసీలు ఏర్పడి కోర్టుకు పోతే దబాయిస్తున్నారని చెప్పి స్వయంగా పార్లమెంట్ సభ్యుడిగా సుప్రీంకోర్టులో నేనే కేసు వేశాననీ, దానిపైన నేను కొట్లాడుతున్న. వారం రోజుల్లో మొత్తం పార్లమెంట్ సభ్యుల బృందం తోటి దానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేయబోతున్నాం అన్నారు.హుజురాబాద్ లోని మొత్తం చెత్తంతా తీసుకొని కరెంటు తయారు చేస్తానని మిషన్లు పెడుతున్నారు… అవి పేరుకే పెడుతున్నారనీ, తప్ప పని చేయవు, ఆ మిషన్లు నడుస్తున్నప్పుడు భయంకరమైన శబ్దాలు వస్తాయి. అది మొదలైన తర్వాత పది పదిహేను కిలోమీటర్లలో భూగర్భ జలాలలో చెరువులలో మొత్తం సర్వనాశము అవుతాయనీ అన్నారు.బోర్లు వేస్తే పచ్చటి నీరు వస్తాయి, వాటితో భోజనం చేసుకోలేము, ముఖాలు కూడా కడుక్కోలేం.
డంప్ యార్డ్ కి వస్తె మీరు టిఫిన్ కూడా తినొచ్చు, వాసన రాదు అని చెప్తారు.. కానీ మాలాంటివారు పోయినప్పుడు సెంటు కొట్టి వాసన రాకుండా చేస్తారు తప్ప ఈ చెత్త నుండి కారిన నీళ్లు ఎంత భయంకరమైన వాసన ఇస్తుందో, రోగాలను వెదజల్లుతుందో అది మాటల్లో చెప్పలేము అని అన్నారు.మోటర్లు పెడతారు కానీ అవి నడవవు… రాత్రిపూట ఆ మీరంతటిని చెరువులకు కాలువలకు విడిచిపెడుతుంటారు. వాళ్ళు చెప్పే ట్రీట్మెంట్ ప్లాంట్లు మోటర్లు నడపరు అవి శుభ్రం చేయరు.
ఆ ప్లాంట్ మొదలైన తర్వాత గాలిలో ఒక రకమైన పురుగులు ఏర్పడతాయి. అవి మనిషి ఒంటిపైన పాకితే దద్దులు వస్తాయి అని అన్నారు. బాలాజీ నగర్ లో పేదలు పడుతున్న ఇబ్బందులు ప్రత్యక్షంగా చూశానని అన్నారు. ఇక్కడ పవర్ ప్లాంట్ వయబుల్ కాదు. ప్రజల జీవితాలతో చెలగాటమాడే దుర్మార్గుల్లారా ఖబర్దార్.
పిచ్చి పిచ్చి వేషాలు వేయవద్దు. నంగనాచి మాటలు మాట్లాడకండి, ముసలి కన్నీరు కార్చవద్దు అని అన్నారు. నేను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలోనే జీవ వచ్చింది అంటున్నారు, నాకు డ్రామాలు చేయడం రాదు,. ప్రజల వైపు ఉంటా. ఇక్కడి వారికి చేతకాకపోతే.. ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తా దీని సంగతి ఏంటో తేల్చుకుంటా, ఈటల పుట్టుకనే ఉద్యమాల పుట్టుక.. ఈటల అంటేనే చైతన్యం.
ఈటల రాజేందర్ ఎవరికీ భయపడడు అని అన్నారు. ఈ ఉద్యమంలో మీ వెంట క్రియాశీలక ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, సంపత్ రావు, రఘు, వెంకట్ రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు







