
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణం శివారులోని సిర్సపల్లి సమీపంలో గల డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త, సాఫ్ట్వేర్ కంపెనీల దిగ్గజం సబ్బన్ వెంకట్ మరో ముఖ్యమైన ముందడుగు వేశారు. ఈ క్రమంలో ప్రముఖ కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారుడు, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి సమస్య తీవ్రతను ఆయనకు కులంకశంగా వివరించారు. డంపింగ్ యార్డ్ కారణంగా నేల, భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు, రైతుల జీవనోపాధి దెబ్బతినడం, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదాలను వెంకట్ స్పష్టంగా తెలియజేశారు. అలాగే ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనను నాయకునీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లేందుకు సబ్బన్ వెంకట్ త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. వచ్చే 15 రోజుల్లో సీఎంను కలిసి ప్రజల సమస్యను నేరుగా వివరించనున్నట్లు చెప్పారు. నేను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదుకానీ ప్రజలకు నష్టం చేసే నిర్ణయాలకు మాత్రం కచ్చితంగా వ్యతిరేకం అంటూ, హుజూరాబాద్ ప్రజల ఆరోగ్యం భవిష్యత్తు నాకు ముఖ్యము అని స్పష్టం చేశారు. ప్రజల ప్రధాన డిమాండ్లు అయిన డంపింగ్ యార్డ్ పనులను తక్షణమే నిలిపివేయాలి. 2 ప్రస్తుత ప్రణాళికను పూర్తిగా రద్దు చేయాలి. 3 సమగ్ర పర్యావరణ ప్రభావ అంచనా (ఇఐఏ ) నిర్వహించాలి. 4 ప్రజా భాగస్వామ్యంతో పారదర్శక నిర్ణయం తీసుకోవాలి. 5 నివాస ప్రాంతాలకు దూరంగా ప్రత్యామ్నాయ స్థలం ఎంపిక చేయాలన్నారు. ప్రజల సమస్యను తన సమస్యగా భావించి ముందుకు సాగుతున్న సబ్బన్ వెంకట్ పై స్థానికులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మొట్టమొదటిగా వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టు పడుతుందని తెలుసుకొని ఉద్యమానికి ఊపిరి పోసిందే సబ్బని వెంకట్ అని హుజురాబాద్ ప్రాంత ప్రజలు గుర్తించి ఆయన చేస్తున్న పోరుకు , సహకరిస్తున్న తీరుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ప్రముఖ కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారుడు, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డిని కలిసి డంపింగ్ యార్డ్ పై వినతి పత్రం అందజేస్తున్న సామాజికవేత్త సబ్బని వెంకట్






