
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రభుత్వ పథకాలపై ప్రజలకు విస్తృత స్థాయి అవగాహన కల్పించాలని, పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వి శ్రీధర్ కోరారు. గురువారం హుజూరాబాద్ పట్టణ శివారులోని కేసి క్యాంప్ లో గల రైతు వేదికలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వము అమలు పరుస్తున్న ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి గృహజ్యోతి, సన్నరకం వడ్లకు బోనస్, బ్యాంకు లింకేజీ వడ్డీలేని రుణాలు, కొత్త రేషన్ కార్డుల వంటి పథకాలపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ బాబు మాట్లాడుతూ… వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థానిక సమస్యలపై అభివృద్ధి ప్రాధాన్యతలు గుర్తించి వాటిని అధికారులు అమలు జరిగే విధంగా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ శాఖల నివేదికలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తూర్పాటి సునీత, తాసిల్దార్ జక్కని నరేందర్, వ్యవసాయ అధికారి భూమిరెడ్డి, సీఐ టీ కరుణాకర్, ఎంఈఓ విడపు శ్రీనివాస్, బస్తీ దవఖాన డాక్టర్ జరీనా, సిడిపిఓ మరాఠీ సుగుణ, సర్పంచులు పోల్సాని రామారావు, కట్కూరి మల్లారెడ్డి, ముప్పు మహేష్, స్వప్న, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వి శ్రీధర్




హాజరైనా వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు





