
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రముఖ విద్యా సంస్థ LEAD లీడ్ నిర్వహించిన “శిక్ష అవార్డ్స్”లో హుజురాబాద్ విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ స్కూల్ మరో కీలక మైలురాయిని సాధించింది. లీడ్ సంస్థ రూపొందించిన కరికులం ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలను సమీక్షించి, ఆ కరికులాన్ని అత్యుత్తమంగా అమలు చేసిన విద్యాసంస్థలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ క్రమంలో విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ స్కూల్ జాతీయ స్థాయిలో విశిష్ట ప్రతిభ కనబరిచి లీడ్ “శిక్ష అవార్డు”ను అందుకుంది.
ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం హైదరాబాద్లోని ప్రముఖ నవోటెల్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ స్కూల్ కరెస్పాండంట్ దాసరి కోటేశ్వర్ యాదవ్, డైరెక్టర్ దాసరి తిరుపతియాదవ్ ఈ అవార్డును స్వీకరించారు.


ఉత్తమ బోధనా ప్రమాణాలు అమలు చేస్తున్నందుకు విజ్ఞాన్ పాఠశాలకు ఈ లీడ్ శిక్ష అవార్డ్ లభించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తు, ఈ విజయానికి సహకరించిన మా ఉపాధ్యాయులు, విద్యార్థులు, ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ పాఠశాల కరెస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ యాదవ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.







