
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని న్యూ శాతవాహన హైస్కూల్లో శనివారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హుజురాబాద్ ఎంఈఓ విడపు శ్రీనివాస్ మాట్లాడుతూ…. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యార్థులు నేర్చుకోవాలని అన్నారు. పిల్లల విద్యాభివృద్ధి కోసం ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. వేసవిలో సెల్ఫోన్లకు పిల్లలను దూరంగా ఉంచాలని అన్ని రంగాల్లో వారిని ముందుండేలా శ్రద్ధ తీసుకోవాలన్నారు. ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోరెం సంజీవరెడ్డి మాట్లాడుతూ…. నూతన వరవడిలో పిల్లలకు విద్యను అందిస్తున్న యాజమాన్యం కృషి అభినందనీయమన్నారు. వకులాభరణం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… కార్పొరేట్ విద్యను మామూలు ఫీజులతో అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు, ప్రశంస పత్రాలు,మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ కరస్పాండెంట్ పరాంకుశం కిరణ్ కుమార్, ఉపాధ్యాయులు రాజయ్య షాహిన్, వెన్నెల, శిరీష, సరిత, అరుణ, సతీష్, సురేష్, రిజ్వానా తదితరులు పాల్గొన్నారు.





